Monday, December 23, 2024

జస్టిస్ షా అంజియోప్లాస్టీ

- Advertisement -
- Advertisement -

Staff of sc judge mr shah test positive for covid

ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స

న్యూఢిల్లీ : గుండెపోటుకు గురైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఆర్ షా ఇక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఆయనకు అత్యంత కీలకమైన అంజియోప్లాస్టీ జరిగింది. ఇతరత్రా పలు పరీక్షలు జరిపేందుకు ఏర్పాట్లు జరిగాయి. గురువారం హిమాచల్ ప్రదేశ్‌లో ఉండగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ప్రత్యేక అంబులెన్స్‌లో ఢిల్లీకి చేర్చి ఇక్కడి ఫోర్టిస్ ఎస్కార్ట్ ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్ అతుల్ మాథుర్ కార్డియాలాజీ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణలో డాక్టర్ల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తోంది. రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల ఆయనకు ఇబ్బంది ఏర్పడిందని వెల్లడైంది. అంజియోప్లాస్టీ విజయవంతం కావడంతో ఇప్పుడు ఆయనను తదుపరి అబ్జర్వేషన్‌కు ఐసియుకు తరలించారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News