Monday, December 23, 2024

ఉచిత హామీలు కురిపించిన వారంతా ఎన్నికల్లో గెలవట్లేదు కదా ?

- Advertisement -
- Advertisement -

Supreme Court Key Comments On Freebies

ఉచితాలపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
సూచనల కోసం కమిటీ ఏర్పాటుకు యోచన
తదుపరి విచారణ ఆగస్టు 28 కి వాయిదా

న్యూఢిల్లీ : రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల కిందకు ఏం వస్తాయి.. ఏం రావో తేల్చడం చాలా కష్టంగా మారుతోందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేమని తెలిపింది. ఈ ఉచిత హామీల అంశాన్ని తేల్చేందుకు ఓ కమిటీ వేయాలనుకుంటున్నట్టు వెల్లడించింది. ఎన్నికల ప్రయోజనాల కోసం ఓటర్లకు ఉచితాలను పంపిణీ చేయడానికి పార్టీలు చేస్తున్న ప్రయత్నాలను నియంత్రించాలంటూ న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వం లోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఉచిత హామీలు ఒక్కటే ఎన్నికల్లో గెలుపును నిర్ణయిస్తాయని చెప్పడం సరికాదు. కొన్ని పార్టీలు అనేక వాగ్దానాలు చేసినప్పటికీ ఎన్నికల్లో గెలవలేక పోతున్నాయి. అంతేకాక, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాథి హామీ వంటి పథకాలు పౌరులు గౌరవంగా జీవించేందుకు దోహదపడుతున్నాయి అని చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ అభిప్రాయపడ్డారు. “ ఉచిత విద్య, వైద్యం, తాగునీరు అందించడం వంటి వాటిని ఉచితాలుగా పరిగణించాలా ? కన్సూమర్ ఉత్పత్తులు, ఉచిత ఎలెక్ట్రానిక్ వస్తువులను సంక్షేమ పథకాలుగా అభివర్ణించాలా ? ప్రజాధనాన్ని ఖర్చు చేయడానికి సరైన మార్గం ఏంటనే దానిపై మనం దృష్టి పెట్టాలి.

ఉచితాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కొందరు అంటుండగా, మరికొందరు అవన్నీ సంక్షేమ పథకాలని చెబుతున్నారు. దీంతో ఈ అంశం సంక్లిష్టంగా మారుతోంది. అందుకే ఉచితాలపై చర్చించి సూచనలు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దీనిపై మీ సలహాలు ఇవ్వండి” అని సీజేఐ జస్టిస్ ఎన్‌వి రమణ వ్యాజ్యదారులకు సూచించారు. అనంతరం ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 22 నాటికి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. అశ్వినీ ఉపాధ్యాయ్ వేసిన ఈ పిటిషన్‌లో వాదనల కోసం తమను కూడా చేర్చుకోవాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, డిఎంకె కూడా పిటిషన్లు దాఖలు చేశాయి. దీనిపై గతంలో వాదనలు విన్న సుప్రీం కోర్టు ఎన్నికల ముందు పార్టీల ఉచిత వాగ్దానాల అంశాన్ని పరిశీలిస్తామని , ఆ అంశంలో నిబంధనలు ఉల్లంఘించిన రాజకీయ పార్టీలను రద్దు చేయాలన్న విజ్ఞప్తి జోలికి మాత్రం వెళ్ల బోమని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News