Thursday, April 10, 2025

నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు చెప్పలేమా?

- Advertisement -
- Advertisement -

నాలుగేళ్లు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే
కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా?
రాజ్యాంగ సంరక్షణ కోర్టుల విధి కదా?
ఫిరాయింపు ఎంఎల్‌ఎల అనర్హత పిటిషన్లపై
ప్రశ్నలు సంధించిన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్
గవాయ్ ఉప ఎన్నికలు రావంటూ అసెంబ్లీలో
సిఎం ప్రకటించడాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన
పిటిషనర్ తరఫు న్యాయవాది

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్‌ఎల అనర్హత కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిం ది. ఎంఎల్‌ఎల అనర్హతపై నాలుగేళ్లు స్పీకర్ ఎ లాంటి చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చూ స్తూ ఉండాల్సిందేనా? అంటూ సుప్రీం ప్రశ్నించింది. న్యాయస్థానాలు రాజ్యాంగ పరిరక్షకులు గా వ్యవహరిస్తాయని జస్టిస్ బిఆర్ గవాయ్ స్ప ష్టం చేసారు. ఈ కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీక ర్ తరఫున సీనియర్ న్యాయవాది జస్టిస్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇదివరకే బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు పాడి కౌశిక్ రెడ్డి, కెటిఆర్, బిజె పి నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి వారి తరఫు లాయ ర్ల వాదనలు విన్నది. అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింగ్వీ వాద న లు వినిపించనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ధర్మాసనం సమయం కేటాయించిం ది. బుధవారం విచారణలో ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఎల్‌ఎల తరఫు వాదనలు సుప్రీంకోర్టు ధర్మాసనం విన్నది. స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవని, ఒకసారి ఆయన నిర్ణయం తీసుకున్నాకే న్యాయ సమీక్షకు అవకాశముంటుం దని ముకుల్ రోహిత్గీ కోర్టులో వాదించారు. స్పీకర్ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడం భావ్యం కాదని రోహత్గీ తెలిపారు. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదని వాదనలు వినిపించారు.

రోహిత్గీ వాదనలపైన స్పందించిన జస్టిస్ గవాయ్ ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు చెప్పలేమా అని ప్రశ్నించారు. ఈ మేరకు స్పీకర్‌కు విజ్ఞప్తి చేయడం లేదా ఆదేశించడమో చేయలేమా అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై రోహత్గీ స్పందిస్తూ ఎంఎల్‌ఎలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వారంలోనే న్యాయస్థానంలో పిటిషన్ వేశారన్నారు. ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారని కనీసం పరిశీలించే అవకాశం కూడా లేకుండా పిటిషన్లు వేశారని వెల్లడించారు. ఫిరాయింపుపై పిటిషనర్ల ఇష్టానుసారం స్పీకర్ వ్యవహరించలేరని రోహత్గీ చెప్పారు. 2024 మార్చి 18న పిటిషనర్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారని, 2025 జనవరి 16న 10 మంది ఎంఎల్‌ఎలకు నోటీసులు జారీ చేసి స్పీకర్ తన విధులు నిర్వర్తిస్తున్నారని ఆయన అని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్లపై ఫిర్యాదులు ఇచ్చినా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఎందుకు చర్యలు తీసుకోలేదని కోర్టు పలుమార్లు అసహనం వ్యక్తం చేసింది. ఉప ఎన్నికలు రావంటూ సిఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన అంశాన్ని కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ట

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News