Sunday, October 6, 2024

కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్.. సిబిఐకి నోటీసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు. కవితకు వ్యతిరేకంగా గతంలో సిబిఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా, అందులో తప్పులున్నాయం టూ కవిత తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సిబిఐ ఛార్జ్‌షీట్‌ను రీఫైలింగ్ చేయగా, అందులోనూ తప్పులున్నాయని చెప్పా రు. ఈ మేరకు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు. కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు, వచ్చే గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ సిబిఐకి ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

డిఫాల్ట్ బెయిల్ అంటే..
నిర్ణీత వ్యవధిలోగా పోలీసులు, దర్యాఫ్తు సంస్థలు కేసు విచారణ పూర్తిచేయడంలో విఫలమైతే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తికి బెయిల్ పొందే హక్కును క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) కల్పిస్తోంది. సిఆర్‌పిసి సెక్షన్ 167(2) ప్రకారం నిర్దిష్ట గడువు లోగా విచారణ పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయడంలో పోలీసులు విఫలమైతే బెయిల్ పొందే హక్కు నిందితులకు ఉంటుంది.

అయితే, ఇది కేసు తీవ్రతను బట్టి దర్యాఫ్తు గడువు వేర్వేరుగా ఉంటుంది. సాధారణంగా నిందితులను అరెస్టు చేసిన తర్వాత 24 గంటల్లో విచారణ పూర్తిచేయడం సాధ్యం కాదని పోలీసులు భావిస్తే నిందితులని కోర్టులో ప్రవేశ పెట్టి కస్టడీకి కోరాల్సి ఉంటుంది. జడ్జి 15 రోజుల వరకు కస్టడీకి (పోలీస్ లేదా జ్యుడీషియల్) అప్పగిస్తారు. ఆ గడువులోగా కూడా విచారణ పూర్తి కాకుంటే కేసు తీవ్రతను బట్టి కస్టడీ గడువును జడ్జి పొడిగిస్తారు.

మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష లేదా కనీసం పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసుల్లో కస్టడీ గడువు గరిష్ఠంగా 90 రోజులు, మిగతా కేసుల విషయంలో దర్యాఫ్తు అధికారి/ సంస్థ మరో అత్యవసర కేసును కూడా విచారిస్తుంటే గరిష్ఠంగా 60 రోజుల కస్టడీ విధించవచ్చు. ఈ గడువు పూర్తయినా కూడా కేసు విచారణ పూర్తవ్వని సందర్భంలో నిందితులు పొందే చట్టబద్ధమైన హక్కునే డిఫాల్ట్ బెయిల్ అంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News