న్యూఢిల్లీ: రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్ శాసనసభా పక్షంలో ఆరుగురు బిఎస్‌పి ఎమ్మెల్యేల విలీనాన్ని సవాలు చేస్తూ దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్‌కు, మరి కొందరికి నోటీసులు జారీచేసింది.
అధికార కాంగ్రెస్ పార్టీలో మొత్తం ఆరుగురు బిఎస్‌పి ఎమ్మెల్యేలు విలీనం కావడాన్ని సవాలు చేస్తూ వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశిస్తూ గతంలో రాజస్థాన్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ, బిజెపి ఎమ్మెల్యే మదన్ దిలావర్ సుప్రీంకోర్టులో వేర్వేరుగా అప్పీలు దాఖలు చేశారు. దీనిపై గురువారం జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కెఎం జోసెఫ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ జరిపింది. దీనికి సమాధానాలు కోరుతూ అసెంబ్లీ స్పీకర్‌కు, అసెంబ్లీ కార్యదర్శికి, పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో విలీనమైన ఆరుగురు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.
రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -