- Advertisement -
న్యూఢిల్లీ : సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఉదయనిధి స్టాలిన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు తమిళనాడు ప్రభుత్వం నుంచి మంత్రి ఉదయనిధి స్టాలిన్ నుంచి స్పందన కోరుతూ నోటీస్‌లు జారీ చేసింది. మంత్రి ఉదయనిధిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని కోరుతూ పిటిషనర్ బి. జగన్నాథ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌లు అనిరుధ్ బోస్, బేలా ఎం త్రివేదీలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. సిబిఐ, తమిళనాడు పోలీస్‌లతో సహా మొత్తం 14 మందికి నోటీస్‌లు జారీ చేసింది.
- Advertisement -