Monday, December 23, 2024

ఎపి సిఎం జగన్ ఆస్తుల కేసులో.. విజయసాయికి సుప్రీం కోర్టు నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జగన్ అక్రమాస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్‌తో పాటు వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సిబిఐ కేసుల విచారణ తేలేవరకూ ఇడి కేసుల విచారణ ఆపాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఇడి) సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇడి పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం సెప్టెంబర్ 5లోగా సమాధానం చెప్పాలని, ప్రతివాదులుగా ఉన్న విజయసాయిరెడ్డి, భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ సంస్థకు నోటీసులు ఇచ్చింది.

ఈ కేసు పూర్తి స్థాయి విచారణ సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం చేపట్టాలో, లేదంటే త్రిసభ్య ధర్మాసనం చేపట్టాలో ఆరోజే నిర్ణయిస్తామని వెల్లడించింది. సిబిఐ, ఇడి కేసుల విచారణ సమాంతరంగా కొనసాగించవచ్చని, గతంలో హైదరాబాద్‌లోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలివ్వగా, వాటిని నిందితులు తెలం గాణ హైకోర్టులో సవాల్ చేశారు. అయితే, సిబిఐ ఛార్జిషీట్లపై తీర్పు వెల్లడైన తర్వాతే ఇడి కేసుల విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు 2021లో తీర్పు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను ఇడి ‘సుప్రీం’లో సవాల్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News