Saturday, November 23, 2024

న్యూస్‌క్లిక్ కేసులో ఢిల్లీ పోలీస్‌లకు ‘సుప్రీం’ నోటీస్‌లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉపా కేసులో అరెస్టయిన న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ, హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పోలీస్‌లకు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈనెల 30 వ తేదీకి వాయిదా వేసింది. పురకాయస్థ , అమిత్ చక్రవర్తి తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, దేవదత్ కామత్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇద్దరు జైలులో ఉన్నారని, సత్వరమే పిటిషన్‌పై విచారణ జరపాలని సుప్రీం కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం విచారణ జరిపింది. ఈ నెల 30 లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు పోలీస్‌లకు ఆదేశించింది. అంతకు ముందు పుర్కాయస్థ, అమిత్ చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో వీరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన న్యూస్‌క్లిక్‌కు విదేశీ నిధులు అందుతున్నాయన్న ఆరోపణలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News