Wednesday, January 22, 2025

జర్నలిస్టు సౌమ్య హంతకులకు సుప్రీం నోటీసులు

- Advertisement -
- Advertisement -

బెయిల్ రద్దు కోరుతూ తల్లి పిటిషన్

న్యూఢిల్లీ: టివి జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న నలుగురు దోషులకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ హతురాలి తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం నలుగురు దోషులకు నోటీసులు జారీచేసింది. బెయిల్‌పై విడుదలైన నలుగురు ఖైదీలు ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేగాక నాలుగు వారాలలో సమాధానం ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు కూడా సుప్రీంకోర్టు నోటీసు జారీచేసింది. సౌమ్య విశ్వనాథన్ తల్లి మాధవి విశ్వనాథన్ ఈ పటిషన్ దాఖలు చేశారు.

2008 సెప్టెంబర్ 30న ఢిల్లీలో విధులు నిర్వహించి ఇంటికి వెళుతున్న సౌమ్య విశ్వనాథన్ తెల్లవారుజామున హత్యకు గురయ్యారు. ఈ కేసులో నలుగురు నిందితులకు కింది కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 2023 నవంబర్‌లో తీర్పు వెలువరించింది. కాగా ఇప్పటికే దోషులు రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ సింగ్ మాలిక్, అజయ్ కుమార్ 14 సంవత్సరాల 9 నెలల జైలు శిక్షను అనుభవించడాన్ని పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు వారి యావజ్జీవ జైలు శిక్షను రద్దు చేసి వారికి బెయిల్ మంజూరు చేస్తూ ఫిబ్రవరి 24న ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని సవాలు చేస్తూ మాధవి విశ్వనాథన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News