Monday, December 23, 2024

క్షణ న్యాయమార్గం మీ చేతుల్లోనే జిల్లా జుడిషియరీకి సిజెఐ పిలుపు

- Advertisement -
- Advertisement -

CJI call to District Judiciary

న్యూఢిల్లీ : దేశంలో వ్యాజ్యాల తక్షణ పరిష్కారానికి ప్రత్యామ్నాయ పరిష్కార విధానం (ఎడిఆర్) వైపు కక్షిదారులు మొగ్గుచూపితే మంచిది. ఈ మార్గంలోకి వారిని మళ్లించే బాధ్యతను జిల్లా స్థాయిల న్యాయవ్యవస్థ తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ శనివారం విజ్ఞప్తి చేశారు. జమ్మూ కశ్మీర్, లద్ధాఖ్‌లలో హైకోర్టు నూతన కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాన న్యాయమూర్తి ఇక్కడ మాట్లాడారు. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కేసులు విచారణల దశలతో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విధంగా సత్వర న్యాయపరిష్కారం దిశలో సంబంధితులకు సమస్యలు తలెత్తుతున్నాయి. లిటిగెంట్లు న్యాయస్థానాలలో కేసుల ద్వారానే సమస్యల పరిష్కారానికి దిగాలనే ఆలోచన క్రమేపీ తగ్గాల్సి ఉంది. సవ్యమైన పరిష్కారంగా మధ్యవర్తిత్వ ప్రక్రియ ఎడిఆర్ చోటుచేసుకుంది.

దీనిని జనంలోకి విరివిగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత జిల్లా స్థాయి న్యాయాధికారులు , న్యాయస్థానాలు తీసుకువెళ్లాలి. ఇది జరిగి తీరాలని సిజెఐ స్పష్టం చేశారు. ప్రత్యేకించి గ్రామీణ పట్టణ స్థాయిలో జనం ప్రతి వివాదానికి కోర్టుల వరకూ వెళ్లలేని స్థితి ఉంటుంది. వారికి ప్రత్యామ్నాయ న్యాయ పరిష్కారం దిశలో ఎడిఆర్ నిలిచింది. జిల్లా స్థాయి జుడిషియర్‌కి ప్రజలతో నేరుగా సంబంధం ఉంటుంది. వారు వారిని ఈ దిశలో తమ చట్ట న్యాయపరమైన వ్యాజ్యాలను పరిష్కారించుకునేందుకు ఈ చక్కని మార్గాన్ని కల్పించాల్సి ఉంటుందన్నారు. స్థానికంగా చీఫ్ జస్టిస్ ఇక్కడ లాయర్లను ఉద్ధేశించి ఓ సభలో మాట్లాడారు. అప్రమత్తంగా ఉండే న్యాయవాదుల సంఘాలు, న్యాయవాదులు న్యాయవ్యవస్థకు మూలాధారం, ఈ విధంగా ప్రజలకు వారు మేలు చేసే వారిగా ఉంటారని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News