Sunday, April 20, 2025

చెట్ల పునరుద్ధరణ జరగకపోతే జైల్లో వేస్తాం

- Advertisement -
- Advertisement -

కంచ గచ్చిబౌలిలో చెట్లు కొట్టేసేముందు సుప్రీం మార్గదర్శకాల ప్రకారం అనుమతులు
తీసుకున్నారా? అనుమతులు లేకుండా చెట్లు నరికినట్లు తేలితే సిఎస్
జైలుకు వెళ్లాల్సి వస్తుంది పర్యావరణ పునరుద్ధరణ ప్రణాళిక సమర్పించాలి
ప్రైవేటు భూముల్లో చెట్లు నరికినా తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరిక చెట్ల
నరికివేతకు తగిన పద్ధతి పాటించలేదని సాధికార కమిటీ స్పష్టీకరణ
కేసు విచారణ మే 15కు వాయిదా సుప్రీం ఆదేశాలు పాటిస్తాం : శ్రీధర్‌బాబు

న్యూఢిల్లీ : కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంతంలోని వంద ఎకరాల విధ్వంసం వల్ల ఇక్కట్లపాలైన వన్యప్రాణులను రక్షించేందుకు తక్షణచర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ వన్యప్రాణి వార్డెన్ ను ఆదేశించింది. జింకలతో కలిసి ఎత్తయిన భవనాలు నిర్మించలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కంచ గచ్చిబౌలి ప్రాం తంలో ఒక్క చెట్టును కూడా నరికివేయరాదని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఎజి మ సీహ్ లతో కూడిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలి ప్రాంతంలో అటవీ నిర్మూలనను రాష్ట్రప్రభుత్వం సమర్థించుకుంటే, దానికి కా రకులైన అధికారులను అదే స్థలంలోని తాత్కాలిక జైలుకు పంపేలా సుప్రీంకోర్టుద్వా రా ఆదేశాలు జారీ కాగలవని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు. చెట్లను నరికివేయడం మాని, తాము చేపట్టిన కార్యాచరణను కోర్టుకు వివరించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీని ధర్మాసనం ఆదేశించింది. రాజ్యాంగం ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు ప ర్యావరణం, జీవావరణ శాస్త్ర పరిరక్షణకోసం ఎటువంటి కఠినమైన ఆదేశాలనైనా జారీ చేయగలదని ధర్మాసనం హెచ్చరించింది.

గతంలో చండీగఢ్ లోని సుఖ్నా సరస్సును రక్షించేందుకు భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టును సుప్రీంకోర్టు నిలిపివేసిన విషయాన్ని న్యాయమూర్తులు ఈ సందర్భంగా ప్రస్తావించారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న భూమిలో పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేయడం వల్ల ప ర్యావరణానికి అపార నష్టం జరుగుతుందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పర్యావరణం, జీవావరణశాస్త్ర పరిరక్షణకు ఇది పెద్ద అడ్డంకి కాగలదని పేర్కొంది. ఆ ప్రాంతంలో చెట్లను నరికి వేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తొందరపడుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఆ ప్రదేశంలో డజన్ల కొద్దీ బుల్డోజర్లు వెళ్లిన విషయాన్ని జస్టిస్ గవాయ్ ప్రస్తావించారు. ఆ వంద ఎకరాల భూ మిని ఎలా పునరుద్ధరించాలో, పచ్చదనంతో కళకళలాడేటట్లు చూడాలో మీరు ఒక ప్రణాళిక ను రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం తరుపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి ధర్మాసనం సూచించింది.చెట్లు నరికివేత పూర్తిగా నిలిపివేసినట్లు ఆయన సుప్రీంకోర్టుకుతెలిపారు. చాలావరకూ చెట్ల నరికివేతకు తగిన అనుమతులు పొందారని,

కొన్ని చెట్లనే నరికివేశారు తప్ప చాలా చెట్లు అలాగే ఉన్నాయని అన్నారు. చెట్లను నరికివేయడంతో ఆ ప్రాంతంలో జంతువులు, వన్యప్రాణులు ఆశ్రయంకోసం పరుగులు పెడుతున్న వీడియోలను చూసి ఆశ్చర్యం కలిగిందని, కొన్ని వవ్యప్రాణులపై వీధి కుక్కలు దాడి చేశాయని అంటున్నారని న్యాయమూర్తులు పేర్కొన్నారు. కాగా, ఆ ఆరోపణలను మను సింఘ్వి కొట్టివేశారు. ఏనుగుల చిత్రాలు ఉన్నాయని అంటున్నారని, తాను ఆ ఏనుగులను చూడగలిగితే బాగుండునని సింఘ్వి నవ్వుతూ అన్నారు. కోర్టు ముందు అటవీ సంబంధిత విషయాలలో అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది కె. పరమేశ్వర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం స్వీయ – ధ్రువీకరణ విధానాన్ని అవలంభిస్తోందని, కొన్ని జాతులకు మినహాయింపు ఉందని స్వీయ ప్రకటన చేసిందని అన్నారు. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జోక్యం చేసుకుని, ముంబై మెట్రో ప్రాజెక్టుకోసం చెట్లను నరికివేయడాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్న ప్రజలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో కంచ గచ్చిబౌలి భూమి విషయంలో కొన్ని లోపాలు జరిగి ఉండవచ్చునని అభిషేక్ సింఘ్వి అన్నారు. అయితే ప్రభుత్వం చర్యలు నిజాయితీగా ఉన్నాయని సమర్థించారు. ప్రధాన కార్యదర్శి కేవలం సమన్వయకర్త మాత్రమే నని అంటూ ఆమె త్వరలో పదవీ విరమణ చేయనున్నారని సింఘ్వీ తెలిపారు. కోర్టు ఇలాంటి విషయాలలో అధికారులు, మంత్రుల వివరాలప్రకారం ముందుకు వెళ్లబోదని జస్టిస్ గవాయ్ తెలిపారు. ప్రైవేటు అడవులలో కూడా చెట్లు నరికి వేయాలంటే కోర్టు అనుమతి తప్పని సరి అన్న విషయాన్ని గుర్తు చేశారు. దాదాపు లక్షమందికి ఉద్యోగాలు సృష్టించే లక్ష్యంతో 50 కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు ప్రక్రియ 2024 లోనే ప్రారంభమైందని, ఇటీవలి చర్యగా దీనిని చిత్రీకరిస్తున్నారని న్యాయవాది సింఘ్వి అన్నారు. దీంతో ప్రభుత్వ చర్యలను సమర్థించుకోవడానికి బదులు, అటవీ భూమి పునరుద్ధరణకు ఒక ప్రణాళిక అందించడమే సరైన మార్గం అని న్యాయమూర్తి హితవు చెప్పారు. ఈ సందర్భంగా పర్యావరణ పునరుద్ధరణ కోసం తమ కార్యాచరణ ప్రణాళికను వివరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేస్తుందని సింఘ్వీ హామీ ఇచ్చారు.

సెంట్రల్ ఎన్ పవర్ కమిటీ నివేదిక
సెంట్రల్ ఎన్ పవర్ కమిటీ తన నివేదికలో తీవ్ర ఆందోళన కలిగించే తీర్పును ఇచ్చిందని అటవీ విషయాలలో అమికాస్ క్యూరీగా ఉన్న న్యాయవాది పరమేశ్వర్ గుర్తు చేశారు. ప్రభుత్వం ఒక ప్రైవేటు పార్టీకి భూమిని తనఖా పెట్టిందని, ప్రధాన కార్యదర్శి కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ఆ విషయాన్ని ప్రస్తావించలేదని పేర్కొన్నారు. ఇప్పుడు వారు అటవీ పునరుద్ధరణపై సూచనలను కోరతారనేది గొప్ప విషయం అని ఆయన వ్యాఖ్యానించారు. చెట్ల నరికివేత కారణంగా ఆశ్రయం కోల్పోయిన జంతువులను రక్షించేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో కేసు తదుపరి విచారణ తేదీన వివరించాలని రాష్ట్ర వన్యప్రాణి వార్డెన్ ను కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను 2025 మే 15నాటికి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News