Monday, December 23, 2024

సెంటర్ల వారిగా ఫలితాలివ్వండి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నీట్ యుజి పరీక్షలకు సంబంధించి సుప్రీంకోర్టు గురువారం జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణ అధీకృత సంస్థ ఎన్‌టిఎకు కీలక ఆదేశాలు వెలువరించిం ది. ఎల్లుండి అంటే ఈ నెల 20వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోగా పరీ క్షా కేంద్రం , నగరాల వారిగా ఫలితాల వివరాలను ప్రకటించాలని స్పష్టం చేసింది. వీటిని వెబ్‌సైట్‌లో ఎన్‌టిఎ పొందుపర్చాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో వి ద్యార్థుల గుర్తింపు వివరాలను వెల్లడించరాదని సూచించింది. నీట్ యుజి పరీక్షా ప్రశ్నాపత్రాల లీకేజ్ ఇతరత్రా అక్రమాల విషయం దేశవ్యాప్తంగా సంచలనానికి దా రితీసింది.ఈ క్రమంలో నీట్ పిజి రద్దు కావాలనికొన్ని పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే కొన్ని చోట్లనే పరీక్షల విషయంలో అక్రమాలు జరిగాయని మొత్తం పరీక్ష రద్దు వద్దని కేంద్ర ప్రభుత్వం, కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేసినందున , అత్యున్నత న్యాయస్థానం దీనిని తా ము క్షుణ్ణంగా పరిశీలించి తీర్పు వెలువరించాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. జ రిగిన పరీక్ష మొత్తం వ్యవహారం పరిశీలిస్తేనే తాము సంబంధిత విషయంపై తుది నిర్ణయం వెలువరించగలమని ధర్మాసనం పేర్కొంది.

రీ టెస్టుకు ముందు పూర్తి స్థాయి ఆరా
పునః పరీక్షల గురించి నిర్ణయం తీసుకోవాలనుకుంటే ముందుగా పరీక్షల నిర్వహణ సక్రమంగా జరిగిందా? అనివార్యంగా పాటించాల్సిన నిర్వహణ పవిత్రత దెబ్బతిందా ? అనే అంశాలు ఖరారు కా వల్సి ఉందని,ఇ ందుకు నగరాలు, ఆయా కేంద్రాల వారిగా రిజల్ట్ జాబితా అవసరం అని పేర్కొన్నారు. విస్తృత స్థాయిలో పరీక్షల్లో అక్రమాలు జరిగాయని వెల్లడైతేనే పున ః పరీక్షలకు వీలుంటుందని తెలిపిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 22కు (సోమవారానికి) వాయిదా వేసింది. నీట్ యుజి అనుబంధంగా కౌన్సెలింగ్ తరువాతి ప్రవేశాలు ఇతరత్రా అంశాలు దీనితో పాటు విద్యాసంవత్సరం, కీలకంగా విద్యార్థుల అమూల్యమైన సమయం వంటివి ముడివడి ఉండటంతో వెంటనే తాము ఆదేశించినట్లు ఎన్‌టిఎ నుంచి కేంద్రాల వారిగా ఫలితాల వెల్లడి అవసరం అని తెలిపారు. నీ ట్ యుజి పరీక్షకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గురువారం రోజంతా వాదోపవాదాలు జరిగాయి.

ఈ దశలో పరీక్షల రద్దుకు పట్టుబడుతున్న పక్షాలు పెద్ద ఎత్తున సా ర్వత్రికంగా పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు సరైన సాక్షాధారాలను ప్రవేశపెట్టడం నైతికం అవుతుందని ధర్మాసనం తెలిపింది. చెదురుమదురుగా జరిగిన అవకతవకలకు పూర్తి స్థాయిలో పరీక్షల రద్దు అనుచితం అవుతుంది కదా అని ధర్మాసనం సంబంధిత పక్షాల న్యాయవాదులను ప్రశ్నించింది. రిటెస్టు జరగాలా? వద్దా అనేది కీలకమైన విషయం , దీనికి ముందు సరైన ప్రాతిపదికలను నిర్థారించుకోవల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఇప్పటి ప్రాధమిక సమాచారం ప్రకారం పాట్నా , హజారీబాగ్‌లలో ప్రశ్నాపత్రాల లీక్ జరిగినట్లు సూచనప్రాయంగా తెలిసిందని, అయితే గుజరాత్‌లోని గోద్రాలో ఇటువంటిది ఏమీ లేదని ధర్మాసనం పేర్కొంది. రెండు ప్రాంతాలకు లీక్ అనేది పరిమితం అని ఇప్పటికైతే నిర్థారణ అయిందన్నారు. ఇక గోద్రాలో కొందరి అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను భర్తీ చేసేందుకు భారీ స్థాయిలో డబ్బులు లాగాడనే ఆరోపణలు వచ్చాయని తెలిపారు.

లీకేజ్‌ను ప్రచారం చేయడం గొప్పతనమా?
టెలిగ్రామ్ సోషల్ మీడియా వేదికలో ప్రశ్నాపత్రం లీక్ వెలుగులోకి వచ్చిందనే విషయంపై ధర్మాసనం ప్రశ్నించింది. కొందరు డబ్బుల కోసం లీక్‌కు పాల్పడి ఉంటారు, దీనిని జాతీయ అంశంగా ప్రచారం చేయడం వల్ల జరిగేదేమిటీ? చివరికి విద్యార్థుల కీలక పరీక్షలకు వారి భవిష్యత్తుకు సంబంధించిన వ్యవస్థతో ఆడుకున్నట్లే అవుతుంది కదా అని ధర్మాసనం నిలదీసింది. కొందరు పైసల కోసం సాగింంచే తంతును తీసుకుని యావత్తూ పరీక్షల వ్యవస్థను దెబ్బతీసే విధంగా అప్రతిష్ట పాలుచేయడం అనుచితమే అవుతుందని కోర్టు పేర్కొంది. అక్రమాలకు పాల్పడ్డ వారు ఏమి? ఎందుకు చేశారనేది వెల్లడయినప్పుడు , వీరి వైఖరి వల్లనే పరీక్ష వ్యవస్థను వేరే విధంగా చిత్రీకరించ డం భావ్యమా అని ప్రశ్నించారు. త్రిసభ్య ధర్మాసనంలో న్యాయమూర్తులు జెడి పార్థీవాలా, మనోజ్ మిశ్రా కూడా సభ్యులుగా ఉన్నారు.

ఈ వైద్య ప్రవేశ పరీక్షల వివాదాస్పద అంశం కేవలం వివాదం అనుకోరాదు, దీనితో పలు రకాల సామాజిక ప్రభావాలు, పరిణామాలు ముడివడి ఉన్నాయని ధర్మాసనం విచారణలో తెలిపింది. లక్షలాది మంది యువ విద్యార్థులు ఈ వ్యవహారంపై ఫలితం కోసం ఎదురుచూస్తున్నారని , దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకోవల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. లీకేజ్‌పై సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికీ సిబిఐ నుంచి తమకు అందిన సమాచారాన్ని వివరించడం జరిగితే ఇది సంబంధిత దోష వ్యక్తులు జాగ్రత్తలు తీసుకునేలా చేస్తుందని ధర్మాసనం తెలిపింది. పరీక్ష రద్దు కావాలని, వద్దని దాదాపుగా 40కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. గురువారం నాటి సుప్రీంకోర్టు విచారణను దేశవ్యాప్తంగా విద్యార్థులు, న్యాయవాద వృత్తితో సంబంధం ఉన్నవారు నిశితంగా ఆసక్తిగా గమనించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News