న్యూఢిల్లీ: పవిత్ర ఖురాన్‌లోని 26 ప్రవచనాలను తొలగించాలంటూ ఉత్తర్‌ప్రదేశ్ షియా వఖ్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ వసీమ్ రిజ్వీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ పిటిషన్ పూర్తిగా పనికిరానిదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు సమయాన్ని వృథా చేశారన్న కారణంతో పిటిషన్ వేసిన రిజ్వీకి రూ.50 వేల జరిమానా విధించింది. న్యాయమూర్తులు ఆర్‌ఎఫ్ నారిమన్, బిఆర్ గవాయి, హృషికేశ్‌రాయ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపి తిరస్కరించింది.
ఖురాన్‌లోని ఆ 26 ప్రవచనాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని రిజ్వీ ఆరోపించారు. ఇస్లాం మతం సమానత్వం, సహనంపై ఆధారపడిందని, ఆ ప్రవచనాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని రిజ్వీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, రిజ్వీ వాదనను పలు ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముస్లింల మనోభావాల్ని గాయపరిచేలా రిజ్వీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని మండిపడ్డాయి. ఈమేరకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లా కొత్వాల్ పోలీస్ స్టేషన్‌లో రిజ్వీపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అంజుమన్ ఖుద్దమ్‌ఇరసూల్ కార్యదర్శి షాన్ అహ్మద్, ఇత్తేహాద్‌ఇమిల్లత్ కౌన్సిల్ ఫిర్యాదుతో ఆ ఎఫ్‌ఐఆర్ నమోదైంది.