- Advertisement -
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ ఎస్) ఎంఎల్ ఏల ఎర కేసులో సిట్టింగ్ జడ్జీ పర్యవేక్షణను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. సిట్టింగ్ జడ్జీ పర్యవేక్షణ విచారణ జరపాలంటూ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జీ ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం పక్కన పెట్టింది. అంతేకాక సిట్ విచారణ కొనసాగించాలని సూచించింది.
సిట్ విచారణ స్వేచ్ఛగా జరిగేలా అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సిట్‌పై ఉన్న ఆంక్షలు, నియమనిబంధనలను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. సిట్టింగ్ జడ్జీ వద్ద పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను నాలుగు వారాల్లో పరిష్కరించాలని న్యాయమూర్తులు గవాయ్, విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
- Advertisement -