Monday, December 23, 2024

మథురలో ఈద్గా సముదాయం సర్వేపై స్టే కొనసాగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో కృష్ణ జన్మభూమి ఆలయానికి ఆనుకుని ఉన్న షాహి ఈద్గా మసీదు సముదాయంపై కోర్టు పర్యవేక్షిత సర్వే కోసం అలహాబాద్ హైకోర్టు జారీ చేసినఇచ్చిన ఉత్తర్వు అమలుపై తాము జారీ చేసిన మధ్యంతర స్టే కొనసాగుతుందని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది. షాహి మసీదు ఈద్గా మేనేజ్‌మెంట్ ట్రస్ట్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏప్రిల్ మొదటి వారంలో విచారణ జరుపుతామని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా,

దీపంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ‘ఎప్పుడు మంజూరైనా మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయి. ఏప్రిల్ ప్రథమార్ధంలో విచారణకు తిరిగి జాబితాలో చేర్చండి’ అని ధర్మాసనం తన ఉత్తర్వులో సూచించింది. అప్పటికి తమ వాదనలు పూర్తి చేయవలసిందని పార్టీలను బెంచ్ ఆదేశించింది. ఈ అంశంపై తమ ముందు ఉన్న పిటిషన్లు అన్నిటినీ ఏప్రిల్‌లో విచారణకు చేపట్టగలమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News