Monday, December 23, 2024

మారన్‌కు రూ.380 కోట్లు చెల్లించాలంటూ స్పైస్‌జెట్‌కు సుప్రీం కోర్టు ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్పైస్‌జెట్ లిమిటెడ్ మాజీ ప్రమోటర్ కళానిధి మారన్‌కు రూ.380 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. చెల్లింపు కోసం స్పైస్‌జెట్‌కు మరింత సమయం ఇవ్వడానికి కూడా కోర్టు నిరాకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ మాట్లాడుతూ, వ్యాపార సమాజంలో వాణిజ్య నీతిని కాపాడుకోవాలంటే ఇదొక్కటే మార్గమని అన్నారు. 7 సంవత్సరాల క్రితం నాటి ఈ కేసు వాటా బదిలీ వివాదానికి సంబంధించినది.

2018 ఆర్బిట్రేషన్ అవార్డు కింద మారన్ ఎయిర్‌లైన్ కంపెనీ నుండి రూ. 362.49 కోట్లను క్లెయిమ్ చేశారు. మారన్‌కు వడ్డీ కింద రూ.75 కోట్లు చెల్లించాలని స్పైస్‌జెట్‌ను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 13న ఆదేశించింది. చెల్లింపు వ్యవధిని పొడిగించాలని స్పైస్‌జెట్ కోర్టును ఆశ్రయించింది. కానీ కోర్టు దానిని తిరస్కరించింది. శుక్రవారం నాడు స్పైస్‌జెట్ షేర్లు 2.93 శాతం పడిపోయి రూ.29.50 వద్ద ముగిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News