Thursday, December 26, 2024

శంభూ సరిహద్దుల్లో యథాతథ స్థితి

- Advertisement -
- Advertisement -

రైతులు, ప్రభుత్వానికి మధ్య అపనమ్మకం ఏర్పడిందని సుప్రీంకోర్టు బుధవారం అభిప్రాయపడింది. తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న రైతులతో చర్చించి పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రముఖ వ్యక్తులతో కూడిన ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. రైతులు, ప్రభుత్వం మధ్య విశ్వాసాన్ని పాదుగొల్పగల తటస్త న్యాయనిర్ణేత అవసరం ఉందని జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఫిబ్రవరి 13 నుంచి రైతులు మకాం వేసిన అంబాలా సమీపంలోని శంభూ సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను వారం రోజుల్లోగా తొలగించాలని ఆదేశిస్తూ హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ

హర్యానా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని, అదే జరిగితే రైతులు ఢిల్లీకి ఎందుకు వస్తామంటారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇక్కడ నుంచి మంత్రులను పంపిస్తున్నారని, వారు మంచి ఉద్దేశంతో వెళ్లినప్పటికీ రైతులు, ప్రభుత్వం మధ్య అపనమ్మకం నెలకొందని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. వారం రోజుల్లో తగిన ఆదేశాలు ఇస్తామని, అప్పటి వరకు శంభూ సరిహద్దుల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని హర్యానా ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News