Thursday, January 9, 2025

సుప్రీంకోర్టులో మోహన్‌బాబుకు ఊరట..

- Advertisement -
- Advertisement -

నటుడు మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి ఘటనలో మోహన్‌బాబుపై నమోదైన హత్యాయత్నం కేసులో ముందు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. విచారణ నాలుగు వారాలు వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు మోహన్‌బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు పంపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News