Monday, December 23, 2024

బాబా రాందేవ్‌కు సుప్రీం ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వ్యాపార ప్రకటనలు ఇచ్చిన కేసులో యోగా గురు రాందేవ్, ఆయన సహచరుడు బాలకృష్ణ, పతంజలి ఆయుర్వేద సంస్థ వార్తాపత్రికలలో ప్రచురించిన బహిరంగ బేషరతు క్షమాపణలో గణనీయమైన మెరుగుదల ఉందని సుప్రీంకోర్టు మంగళవారం ప్రశంసించింది.

క్షమాపణ చెప్పిన భాష తగిన విధంగా ఉందని, పేర్లు కూడా అందులో ఉన్నాయని జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం మంగళవారం సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీకి తెలిపింది. రెండవ క్షమాపణ ఎవరి ఆలోచనో తెలియదు కాని గణనీయమైన మెగరుదల ఉందని జస్టిస్ అమానుల్లా అన్నారు. మొత్తానికి అర్థిం చేసుకున్నందుకు వారిని అభినందిస్తున్నామని ఆయన చెప్పారు. వార్తాపత్రికలలో ప్రచురించిన క్షమాపణ ప్రకటన అసలు ప్రతిని కోర్టులో దాఖలు చేయాలని తాము ఆదేశించినప్పటికీ ఇఫైల్ ఎందుకు చేశారని రోహత్గీని జస్టిస్ అమానుల్లా ప్రశ్నించారు. తమ ఉత్తర్వులకు అనుగుణంగా ఇది లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

చాలా సమాచార లోపం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే కోర్టు ఉత్తర్వులను తాను తన కక్షిదారునికి తెలియచేయడంలో కొంత సమాచార లోపం జరిగిందని రోహత్గీ ఒప్పుకున్నారు. క్షమాపణ ప్రకటన ప్రచురించిన అన్ని వార్తాపత్రికల ప్రతులను కోర్టుకు సమర్పించడానికి మరో అవకాశం ఇవ్వాలని రోహత్గీ కోరారు. ఈ పత్రాలను స్వీకరించవలసిందిగా రిజిస్ట్రీని ఆదేశించిన ధర్మాసనం కేసు తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News