Monday, December 23, 2024

అంబులెన్స్‌ను ఢీకొట్టిన వ్యక్తి పట్ల ఔదార్యమా?

- Advertisement -
- Advertisement -

పంజాబ్ హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : నిర్లక్ష్యం, అతి వేగంతో డ్రైవింగ్ చేసి ఒక్కరి మరణానికి కారణం అయిన వ్యక్తికి పడ్డ శిక్షను తగ్గించడం అనుచితం అని పేర్కొంటూ సుప్రీంకోర్టు మంగళవారం పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పును కొట్టివేసింది. నిర్లక్ష్యంతో వ్యవహరించి ఇతరుల ప్రాణాలు పొయ్యేలా చేసిన వారిపట్ల సానుభూతి ప్రదర్శించడం కుదరదు అని స్పష్టం చేసింది. అనుచిత ఔదార్యం చట్టరీత్యా నిలవజాలదని పేర్కొంది.

నిజానికి హైకోర్టు ఇటువంటి ఉదంతాలలో సంబంధిత ఐపిసి సెక్షన్లను పరిశీలించాల్సి ఉంది. అయితే ఇది జరిగినట్లు లేదని న్యాయమూర్తులు ఎంఆర్ షా, సిటి రవికుమార్‌తో కూడిన ధర్మాసనం ఆగ్రహించింది. ఐపిసి పరిధిలోకి వచ్చే శిక్షలలో స్పష్టత ఉంటుంది. నేరాలకు పాల్పడినట్లు నిర్థారణ అయిన వారిని తగు విధంగా శిక్షించడం ఐపిసి నిర్ధేశిత విషయం అని తెలిపారు. 2012 జనవరిలో ఓ వ్యక్తి రాష్ డ్రైవ్‌లో ఓ అంబులెన్స్‌ను ఢీకొన్న ఘటన జరిగింది. అప్పుడు ఓ వ్యక్తి తీవ్రగాయాలతో తరువాత మృతి చెందగా, ఇద్దరు గాయాలతో కోలుకున్నారు. ఓ అంబులెన్స్‌కు ఆక్సిడెంట్ చేసిన వ్యక్తి పట్ల ఔదార్యం ప్రదర్శించడం ఎంత వరకూ సబబు? కనీసం హైకోర్టు ఐపిసి నిర్ధేశిత సెక్షన్లను పరిశీలించాలి కదా అని ధర్మాసనం ప్రశ్నించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News