- Advertisement -
ఢిల్లీ: కొత్త సాగు చట్టాల రద్దు, రైతు ఆందోళనపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. రైతులతో ఏం చర్చలు జరుపుతున్నారని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. సాగు చట్టాలను తాత్కాలికంగా నిలిపివేయగలారా అని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వ చర్యలపై సుప్రీం ఆగ్రహంతో ఉంది. చట్టాలు ప్రయోజనకరం అని చెప్పడానికి ఒక్క ఉదాహరణ కనిపించడంలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. సమస్యల పరిష్కారానికి చర్చలు జరుపుతున్నామని కోర్టుకు కేంద్రం తరపున ఎజి తెలిపారు. రైతు సమస్యల పరిష్కారం కోసం కమిటీని ప్రతిపాదిస్తున్నామని ఎజి చెప్పారు. రైతు ఆందోళనలో ఏదైనా జరిగితే ప్రతి ఒక్కరం బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. ప్రస్తుతానికి సాగు చట్టాలను నిలిపివేస్తామని, రైతులు ఆందోళన చేసుకోవచ్చని సుప్రీం ధర్మాసంన స్పష్టం చేసింది.
- Advertisement -