Wednesday, October 16, 2024

పంట వ్యర్థాల దగ్ధంపై సుప్రీం ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

పంట వ్యర్థాల దగ్ధానికి దోషులుగా కనుగొన్న ఉల్లంఘనులను ప్రాసిక్యూట్ చేయనందుకు పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను సుప్రీం కోర్టు బుధవారం అభిశంసించింది. వివరణ ఇచ్చేందుకు ఈ నెల 23న తమ ముందు హాజరు కావాలని ఆ రాష్ట్రాల ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులను (సిఎస్‌లను) కోర్టు సమన్ చేసింది. న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, అహ్సనుద్దీన్ అమానుల్లా, అగస్టీన్ జార్జి మసీహ్‌తో కూడిన ధర్మాసనం ఆ రెండు రాష్ట్రాలు ‘అలక్ష వైఖరి’ ప్రదర్శివస్తున్నాయని ఆక్షేపించింది. ఉల్లంఘనులపై చర్య తీసుకోనందుకు ఆ రెండు ప్రభుత్వాల అధికారులపై పీనల్ చర్య గైకొనాలని వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సిఎక్యుఎం)ను బెంచ్ ఆదేశించింది. పంట వ్యర్థాల దగ్ధం దేశ రాజధానిలో కాలుష్య స్థాయిల పెరుగుదలకు ప్రధాన కారణంగా ఉన్నది.

పంట వ్యర్థాల దగ్ధాన్ని ఆపాలని 2021 జూన్‌లో దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)లో సిఎక్యుఎం జారీ చేసిన ఆదేశాల అమలుకు పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం పట్ల సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహంతో ఉన్నది. ‘ఇది రాజకీయ వ్యవహారం కాదు. వేరే ఎవరిదో ప్రేరణతో సిఎస్ వ్యవహరిస్తున్నట్లయితే వారికి కూడా సమన్లు జారీ చేస్తాం. వచ్చే బుధవారం (23న) ముఖ్య కార్యదర్శి (సిఎస్)ను స్వయంగా హాజరై, ప్రతి విషయం వివరించాలని కోరబోతున్నాం. ఏదీ జరగలేదు. పంజాబ్ ప్రభుత్వం తీరూ అదే. ఈ వైఖరి పూర్తిగా ఉల్లంఘించడమే’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. సర్వోన్నత న్యాయస్థానం పంజాబ్ ప్రభుత్వాన్ని తూర్పారపడుతూ, గదచిన మూడు సంవత్సరాల్లో ఒక్క ప్రాసిక్యూషన్ కూడా జరగలేదని, అది ఉల్లంఘనలను సహించడమే అని ఆక్షేపించింది.

‘వ్యక్తులను ప్రాసిక్యూట్ చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? ఇది రాజకీయ వ్యవహారం కాదు. కమిషన్ చట్టబద్ధ ఆదేశాలను అమలు చేయని విషయం. రాజకీయ పరిగణనలు వర్తించబోవు. మీ పరంగా బేఖాతరు చేయడమే. జనాన్ని ఉల్లంఘనలకు మీరు ప్రోత్సహిస్తున్నారు. మీరు నామమాత్రం జరిమానాలు విధిస్తున్నారు. పంట వ్యర్థాల దగ్ధం ప్రదేశం గురించి ఇస్రో మీకు సమాచారం ఇస్తోంది. వాటి దగ్ధం ప్రదేశం కనిపించలేదని మీరు చెబుతున్నారు’ అని బెంచ్ పేర్కొన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News