Monday, December 23, 2024

పిడి చట్టం కరకే …నిర్బంధంలో పద్ధతి ముఖ్యం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కొన్ని చట్టాలు కరకుగానే ఉంటాయి. తప్పదు..నిబంధనలకు అంతా కట్టుబడి ఉండాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముందస్తు నిర్బంధం సంబంధిత ప్రివెంటివ్ డిటెన్షన్ (పిడి) చట్టం , దీని అమలు గురించి శనివారం ధర్మాసనం స్పందించింది. పిడి చట్టంతో వ్యక్తుల స్వేచ్ఛ హరించుకుపోతుంది. అదే సమయంలో విచారణలు లేకుండా ఏళ్ల తరబడి జైళ్లల్లో మగ్గుతున్న సందర్భాలు ఉన్నాయి. చట్టానికి పదును ఉండటం సహజమే, అయితే సంబంధిత విషయాలలో చట్టపరిరక్షకులు ఖచ్చితంగా విధివిధానాలకు , నిబంధనలకు లోబడి వ్యవహరించాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. జార్ఖండ్‌లో ప్రకాశ్ చంద్ర యాదవ్ అలియాస్ ముంగేరీ యాదవ్ నిర్బంధంపై దాఖలు అయిన పిటిషన్ విచారణ తరువాత తరువాత ధర్మాసనం ఆయనను విడిచిపెట్టాలని ఆదేశించింది.

జార్ఖండ్ రాష్ట్ర నేరాల అదుపు చట్టం పరిధిలో యాదవ్‌ను అరెస్టు చేశారు. ఆయన అభ్యర్థనను పట్టించుకోకుండా అధికారులు రెండుసార్లు డిటెన్షన్‌ను పొడిగించారు. దీనిపై ఆయన జార్ఖండ్ హైకోర్టుకు వెళ్లగా ఆయన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీనితో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా జార్ఖండ్ హైకోర్టు తీర్పును న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, సుధాంశు ధుల్లాల ధర్మాసనం కొట్టివేసింది. చట్టం పరిధిలో ఓ వ్యక్తిని అరెస్టు చేసినప్పటికీ సంబంధిత నిబంధనలను పూర్తిస్థాయిలో పాటించాల్సి ఉంటుంది. నేరం చేసినట్లు లేదా చేయనట్లు నిర్థారించే విచారణ ప్రక్రియ లేకుండా డిటెన్షన్ కొనసాగింపులు నిబంధనలకు విరుద్ధం అవుతాయని పేర్కొన్న సుప్రీంకోర్టు ఈ వ్యక్తి విడుదలకు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News