Sunday, November 17, 2024

ఉచితాలకు, సంక్షేమ పథకాలకు ముడిపెట్టొదు

- Advertisement -
- Advertisement -

అవి రెండు వేర్వేరు ఉచిత హామీలను నెరవేర్చని పార్టీల రద్దు అంశం చట్టసభల పరిధిలోని అంశం
అందులో మేం జోక్యం చేసుకోం.. తేల్చిచెప్పిన సిజెఐ జస్టిస్ రమణ
హామీలు, ఆర్థిక వ్యవస్థ మధ్య సమతూకం ఉండాలని సూచన

న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో పార్టీలు ప్రకటించే ఉచిత హామీలు, సంక్షేమ పథకాలు వేర్వేరు అంశాలని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. రెండింటిని ఒకే కోణంలో చూడరాదని అభిప్రాయపడింది. అయితే సంక్షేమ పథకాల చర్యలు, ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యపరమైన విఘాతం మధ్య సమతూకత పాటించాల్సి ఉంటుందని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే క్రమపు సంక్షేమ పథకాలు ఉచితమా అనుచితమా ఆలోచించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఎడాపెడా ఉచిత హామీలకు దిగే రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు అంశాన్ని పరిశీలించడం కుదరదని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణతో కూడిన స్పష్టం చేసింది. ఉచిత హామీల పార్టీల గుర్తింపు రద్దుకు లాయర్, బిజెపి నేత అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజావాజ్యం (పిల్)పై అత్యున్నత న్యాయస్థానం విచారణ కొనసాగిస్తోంది. ఎన్నికల ప్రచారాల దశలో అనుచితరీతిలో, వాస్తవికంగా పొసగని రీతిలో ఉండే ఉచిత హామీలకు దిగే పార్టీల గుర్తింపు రద్దు కు దిగాలనే ఆలోచన అప్రజాస్వామికం అవుతుందని ధర్మాసనం తరఫున జస్టిస్ ఎన్‌వి రమణ స్పష్టం చేశారు. ఎంతైనా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని, రాజకీయ పార్టీల గుర్తింపు రద్దులు వంటి వాటి  విషయంలో తాము జోక్యం చేసుకోదల్చుకోలేదని చీఫ్ జస్టిస్ తెలిపారు. ఉచిత హామీలపార్టీలకు సం బంధించి చట్టబద్ధమైన చర్యల విషయంలో చట్టబద్ధమైన శూన్యత ఉన్నా తాము దీని జోలికి వెళ్లదల్చుకోలేదని తెలిపారు. న్యాయమూర్తి కృష్ణ మురారీ కూ డా సభ్యులుగా ఉన్న బెంచ్ తరఫున ఈ స్పష్టత ఇస్తున్నట్లు వివరించారు. అయితే పార్టీల గుర్తింపు రద్దు అంశంపై సంబంధిత భాగస్వామ్యపక్షాలు తమ సూ చనలను ఈ నెల 17వ తేదీలోగా పంపించాలని తెలిపారు. అయితే అమలుకు సాధ్యం కాని ఉచిత హామీలకు దిగడం తీవ్రస్థాయి అంశమే అవుతుంది. దీనిపై ఏదో ఒకటి జరగాల్సి ఉంది. అయితే ఇది లెజిస్లేటివ్ అధికారిక వ్యవస్థ పరిధిలోకి వచ్చే అంశం అవుతున్నందున, ఇందులోకి తాము చొరబడదల్చుకోలేదని స్పష్టం చేశారు. తనను ఎవరేమి అనుకున్నా న్యాయవ్యవస్థ పరిధిలోకి రాని అంశాల జోలికి వెళ్లడం కుదరదని, అయితే విషయం తీవ్రమైనదైనందున, దీని తో ముడివడి ఉన్న ఇతర విభాగాల వాదనలు వివరణలు కూడా పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రధాన న్యాయమూర్తిగా ఎన్‌వి రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేస్తారు. ఇప్పటికే ఉచితాలు పార్టీల గుర్తింపు రద్దు విషయంపై తన అభ్యర్థనపై సీనియర్ లాయర్ల నుంచి స్పందన వెలువడిందని, మిగిలిన పక్షాలు కూడా ఈ క్రమంలో అవసరం అయిన విధంగా స్పందించాల్సి ఉందని, తాను రిటైరవుతు న్న తేదీకి ముందు దయచేసి వీటిని అందించాలని, కేసును 17కు వాయిదా వేస్తున్నానని తెలిపారు.
ఉచిత హామీలు ఎన్నికల కళలయ్యాయి : కేంద్రం మోయలేని భారాలతో సంస్థలు ఉక్కిరిబిక్కిరి
ఉచిత హామీల సంస్కృతి ఇప్పుడు ఎన్నికలలో పోరుకు దిగే క్రమంలో ఓ కళ అయికూర్చుందని కేంద్రం సుప్రీంకోర్టుకు దీనిపై విచారణ దశలో తెలిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం వాదనను విన్పిస్తూ ఓట్ల వేటలో కనబర్చే కళగా మా రిందని తెలిపారు. ఉచిత హామీలను వెలువరించి, తరువాత వీటిని ప్రాతిపదికగా చేసుకుని తాము ప్రజల కోసం సంక్షేమ పథకాలకు దిగామని కొన్ని పార్టీలు భావించి వ్యవహరిస్తే ఈ పరిణామం ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ఆప్ ఇతర పార్టీల వైఖరిని ఈ విధంగా ఆయన కేంద్రం తరఫున పరోక్షంగా విమర్శించారు. అనుచిత హామీలకు దిగే పార్టీలపై చర్యల విషయంలో సుప్రీంకోర్టు పేర్కొంటున్నట్లు లెజిస్లేచర్ లేదా ఎన్నికల సంఘం చర్యలకు దిగాల్సి ఉంటుంది. అయితే ఈ లోగా పార్టీలకు ఈ విషయంలో మార్గదర్శకసూత్రాలను అంటే చేయదగ్గవి చేయకూడనివి వాటిని అత్యున్నత న్యాయస్థానం నిర్ధేశించాలని తాము కోరుతున్నామని తెలిపారు. ఎన్నికల్లో పార్టీలు పూర్తిగా ఈ ఉచిత హామీలపైనే ఆధారపడుతున్నాయి. ఉచిత హామీలు, సంక్షేమ పథకాలు ఒకటే అనే స్థాయిలో పార్టీలు వ్యవహరిస్తున్న తీరు కీలక రంగాలను ప్రభావితం చేస్తుంది. ఇది దీర్ఘకాలిక తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తెలిపారు. జనాకర్షక పథకాలకు లేదా ఉచిత హామీలకు సంబంధించి అంశాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, ఇందులో కేంద్ర ఆర్థిక కార్యదర్శి, రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శులు, గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులు, 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్, ఆర్‌బిఐ ప్రతినిధి, నీతి ఆయోగ్ సిఇఒ ఈ ప్యానెల్‌లో ఉండాలని కేంద్రం ప్రతిపాదించింది. వ్యాపార వాణిజ్య సమాఖ్యలు, విద్యుత్ రంగ సంబంధిత డిస్కమ్‌ల ప్రతినిధులు ప్యానెల్‌లో ఉండవచ్చునని కూడా తెలిపారు.
ఉచిత హామీలతో ఇప్పటికై పలు విద్యుత్ ఉత్పాదన కంపెనీలు, పంపిణీ సంస్థలు పలు రకాల భారాలకు గురయ్యాయని పలు రకాల ఆర్థిక చిక్కులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించాలని ఇతర ప్రభావిత రంగాలను కూడా పరిశీలించాలని , పార్టీలకు అబ్బి న ఉచిత హామీల కళ తాత్కాలికంగా పార్టీలకు లబ్ధిచేకూరుస్తోంది కానీ తరువాతి పరిణామాలు తీవ్రస్థాయి ప్రభావానికి దారితీస్తున్నాయని కేంద్రం తరఫున స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్ వంటి ఎన్నికల తాయిలాలను ఈ సందర్భంగా కేంద్రం
ప్రస్తావించింది.

 Supreme Court reacts on Free Welfare Schemes

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News