Monday, December 23, 2024

బాండ్స్‌పై రాజ్యాంగ ధర్మాసనం విచారణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రాజకీయ పార్టీలకు విరాళాల సమీకరణల ఎలక్టోరల్ బాండ్స్ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతుంది. ఎలక్టోరల్ బాండ్స్‌పై అధికారిక రూలింగ్‌కు వీలుగా ఈ విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేసినట్లు సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. రాజకీయ నిధుల విషయంలో పారదర్శకతను ఉద్ధేశించి 2018 జనవరి 2వ తేదీన ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్స్ స్కీం తీసుకువచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలకు నగదు రూపేణా విరాళాల క్రమబద్ధీకరణకు, ఎంత మొత్తంలో విరాళాలు అందుతున్నాయనేది నిర్థారించేందుకు దీనిని అమలులోకి తీసుకువచ్చారు. అయితే వీటి చట్టబద్ధతను సవాలు చేస్తూ పలు వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి.

దాదాపు నాలుగు ప్రజావ్యాజ్యాలను ఈ నెల 31, నవంబర్ 1వ తేదీలలో ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం తుది విచారణ జరుపుతుందని ముందుగా తేదీలు ఖరారు అయ్యాయి. అయితే వీటిని ఇప్పుడు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆ తేదీలలోనే విచారిస్తుందని సోమవారం నాడు సుప్రీంకోర్టు తెలిపింది. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్స్ జారీ ప్రక్రియకు ముందే వీటి చెల్లుబాటు పిటిషన్లపై విచారణ పూర్తి కావల్సి ఉందని ఎన్నికల సంస్కరణల ప్రజాస్వామిక సంస్థ (ఎడిఆర్) తరఫున సీనియర్ లాయరు ప్రశాంత్ భూషణ్ తెలిపారు. దీనిని తాము పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఈ నెల 10న త్రిసభ్య ధర్మాసనం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News