Monday, December 23, 2024

‘మరణ శిక్ష తగ్గింపు”పై విస్తృత ధర్మాసనానికి సుప్రీం సిఫార్సు..

- Advertisement -
- Advertisement -

Supreme Court refers to larger bench on granting death penalty

న్యూఢిల్లీ: మరణ శిక్ష విధించే కేసుల విచారణ సమయంలో శిక్ష తగ్గింపు నిర్ధారణకు స్పష్టమైన విధి విధానాల రూపకల్పన అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణను సీజేఐ జస్టిస్ యుయు లలిత్ , జస్టిస్ రవీంద్రభట్, జస్టిస్ ఎస్ దులియాలతో కూడిన బెంచ్ విచారించింది. తీర్పు వెలువరించే సమయంలో జస్టిస్ భట్ మాట్లాడుతూ “ దీనిని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌కు సిఫార్సు చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై ఆదేశాలు జారీ చేసేందుకు వీలుగా సీజేఐ ఎదుటకు తీసుకెళ్లాలి. శిక్ష విధించేందుకు మార్గదర్శకాల విషయంలో ఒకే రకమైన విధానం అమలు చేయాల్సి ఉంది” అని పేర్కొన్నారు. ఈ కేసును సర్వోన్నత న్యాయస్థానం సుమోటో పిల్‌గా తీసుకుంది. మరణ శిక్షను తగ్గించగల ప్రతి పరిస్థితిని విచారణ దశ లోనే న్యాయస్థానం పరిగణన లోకి తీసుకోవాలన్నది పిల్‌లో సారాంశం. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ నేతృత్వం లోని ధర్మాసనం విచారించింది.

Supreme Court refers to larger bench on granting death penalty

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News