Saturday, December 21, 2024

మనీశ్ సిసోడియాకు మరోసారి సుప్రీంకోర్టులో చుక్కెదు

- Advertisement -
- Advertisement -

ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు మరోసారి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ మద్యం కేసులో సోమవారం సిసోడియా బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇరు వార్గాల వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టితో కూడిన ధర్మాసనం.. మద్యం కేసులో రూ.338 కోట్ల నగదు లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తు సంస్థ ఈడీ ఆధారాలు చూపించిందని తెలిపింది.ఈ మేరకు సిసోడియా బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ ధర్మాసనం తీర్పు వెల్లడించింది.

మద్యం లావాదేవీలపై ఈడీ వద్ద ఆధారాలు ఉన్నాయని.. 6, 8 నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని తెలిపినట్లు ధర్మాసనం పేర్కొంది. బెయిల్ కోసం సిసోడియా సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఈనెల 17న బెయిల్ పై తన తీర్పును రిజర్వ్ చేసింది.

కాగా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈడీ అధికారులు.. మనీశ్ సిసోడియాను అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News