Saturday, January 25, 2025

ఆదాయపు పన్ను చట్టంలో టిడిఎస్ రద్దుకు పిల్

- Advertisement -
- Advertisement -

ఆదాయపు పన్ను (ఐటి) చట్టం కింద మూలంలోనే పన్ను మినహాయింపు (టిడిఎస్) వ్యవస్థ రద్దు కోరుతూ దాఖలైన పిల్ పరిశీలనకు సుప్రీం కోర్టు శుక్రవారం నిరాకరించింది. ప్రపంచం అంతటా దానిని విధిస్తున్నారని కోర్టు తెలిపింది. దాదాపు ప్రపంచం అంతటా టిడిఎస్ విధిస్తున్నారని, అంతే కాకుండా దానికి సమర్థనగా తీర్పులు ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం తెలియజేసింది. ఆదాయపు పన్ను చట్టం కింద టిడిఎస్ వ్యవస్థను పిల్ సవాల్ చేసింది. యజమాని వేతనం చెల్లించే సమయంలో పన్ను మినహాయించాలని. దానిని ఐటి శాఖకు జమ చేయాలని చట్టం నిర్దేశిస్తోంది. మినహాయించిన పన్ను చెల్లింపుదారుని పన్ను బాధ్యతకు సర్దుబాటు చేస్తారు.

‘సారీ, మేము దీనిని పరిశీలించబోం& దీనిని చాలా దారుణంగా రూపొందించారు. అయితే, మీరు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించవచ్చు. న్యాయవాది అశ్వనీ దుబే ద్వారా తన వ్యక్తిగత హోదాలో పిల్‌ను దాఖలు చేసిన న్యాయవాది అశ్వనీ ఉపాధ్యాయ్ టిడిఎస్ వ్యవస్థను రద్దు చేయవలసిన అగత్యం ఉందని అన్నారు. అయితే, ఐటి నిబంధనావళికి సంబంధించిన ముఖ్యమైన కొన్ని సమస్యలు ఉండవచ్చునని, దానిని ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేయవచ్చునని సిజెఐ సూచించారు. బెంచ్ తన ఉత్తర్వులో కేసు యోగ్యతలు లేదా అయోగ్యతలపై ఎటువంటి అభిప్రాయలనూ వ్యక్తం చేయలేదు. పిటిషన్ దాఖలైనప్పుడు సరికొత్తగా దానిపై నిర్ణయం తీసుకునే బాధ్యతను హైకోర్టుకు సుప్రీం కోర్టు వదలివేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News