- Advertisement -
ఇంఫాల్ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ నిషేధంపై ఇప్పటికే మణిపూర్ హైకోర్టు విచారణ జరిపింది. ఇంటర్నెట్ పునరుద్ధరించాలా వద్దా అన్న దానిపై ఓ నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీనిపై మణిపూర్ హైకోర్టులో స్వతంత్ర పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు సూచించింది.
- Advertisement -