Sunday, December 22, 2024

అసోం డిలిమిటేషన్‌పై స్టే నిరాకరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అసోంలో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై స్టే మంజూరీకి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఎన్నికల సంఘం ఇప్పుడు ఈ ప్రక్రియను చేపట్టింది. దీనిపై పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ప్రక్రియపై స్టే ఇవ్వడం కుదరదని తెలిపిన సుప్రీంకోర్టు కేంద్రం నుంచి దీనిపై వివరణ కోరింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 8ఎ పరిధిలో పునర్విభజనకు ఎన్నికల సంఘానికి ఉన్న అధికారం రాజ్యాంగ చెల్లుబాటును పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

మూడు వారాల వ్యవధిలో కేంద్రం , అదే విధంగా ఎన్నికల సంఘం సమాధానాలు ఇచ్చుకోవల్సి ఉంటుంది. రెండు వారాల తరువాత పిటిషనర్లు తమ అభ్యర్థనలపై రీజాయిండర్స్ ఇచ్చుకోవల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్థీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇప్పటి డిలిమిటేషన్ ప్రక్రియను సవాలు చేస్తూ తొమ్మిది ప్రతిపక్ష పార్టీలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఇసి ప్రక్రియలో పాటిస్తున్న పద్ధతులను ఈ పార్టీలు తప్పుపట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News