Sunday, January 19, 2025

కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌కు బ్రేక్

- Advertisement -
- Advertisement -

ఆరోగ్యం ఇంకా కుదుటపడనందున తనకు ఇప్పుడున్న బెయిల్‌ను పొడిగించానే అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌కు చుక్కెదురైంది. ఈ పిటిషన్‌ను విచారణల జాబితాలోకి చేర్చేందుకు సుప్రీంకోర్టు రిజిస్ట్రి బుధవారం నిరాకరిచింది. మద్యం స్కామ్ కేసులో ఢిల్లీ సిఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 21 రోజుల మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ పిటిషన్ పెట్టుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నందున ఇప్పటివరకూ జూన్ 2వ తేదీ వరకూ ఉన్న బెయిల్‌ను వారం రోజులు పొడిగించాలని కేజ్రీవాల్ తెలియచేసుకున్నారు. రెగ్యులర్ బెయిల్‌కు ఆయన ట్రయల్ కోర్టుకు వెళ్లే స్వేచ్ఛను అత్యున్నత న్యాయస్థానం కల్పించిందని, ఈ క్రమంలో సుప్రీంకోర్టులో పిటిషన్ స్వీకరణకు వీలులేదని పేర్కొంటూ పిటిషన్ విచారణకు అర్హం కాదని సుప్రీంకోర్టు కార్యాలయం తెలిపింది.

పైగా తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసి ఉంచింది. ఎన్నికల ప్రచారానికి వీలుగా ఆయనకు ఈ నెల 10వ తేదీన 21 రోజుల తాత్కాలిక బెయిల్ ఉపశమనం కల్పించిందని , ఇప్పుడు ఈ బెయిల్ పూర్తి అయిపోవస్తున్నదని కోర్టు రిజిస్ట్రి తెలిపింది. వైద్య కారణాలతో తనకు వారం రోజుల బెయిల్ పొడిగింపు కావాలనే అంశంపై తక్షణ విచారణ సాధ్యం కాదని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. తనకు అత్యధిక షుగర్ ఉంది. హై కెటోన్లు, బ్లడ్ గ్లూకోస్ మోతాదులు, ఉన్నట్లుండి 6 నుంచి 7 కిలోల బరువు తగ్గడం, ప్రాణాంతక పరిస్థితులు వంటివి ఉన్నందున తన బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ వేశారు. అయితే ట్రయల్ కోర్టు అవకాశం ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు ఎందుకు అని పేర్కొంటూ పిటిషన్ అర్హతను ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News