న్యూఢిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డిఎ) పరీక్షల్లో మహిళలు ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది(2022లో) నుంచి కూర్చునేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం పెట్టుక్ను వినతిని సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. మహిళలకు ఉన్న హక్కును తిరస్కరించలేమని పేర్కొంది. న్యాయమూర్తి ఎస్‌కె కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేంద్రం వినతిని విచారించింది.
మహిళలు ఎన్‌డిఎ ఎంట్రెన్స్ పరీక్షలో పాల్గొనేందుకు ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తగిన ఏర్పాటుచేయమంది. అత్యవసర పరిస్థితులను చక్కగా ఎదుర్కొనే ‘రెస్పాన్స్ టీమ్’ సాయుధబలగాలని కూడా అభిప్రాయపడింది.
వచ్చే ఏడాది(2022) నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో మహిళా అభ్యర్థినులు పాల్గొనేలా ఓ ప్రకటన విడుదలచేయగలమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.
2022 మే నాటికి మహిళలకు ప్రవేశం కల్పించడానికి, తగిన యంత్రాంగాన్ని రూపొందించేందుకు ఓ స్టడీ గ్రూప్‌ను కూడా ఏర్పాటుచేసినట్లు అదనపు సొలిసిటర్ జనరల్(ఎఎస్‌జి) ఐశ్వర్య భాటి ధర్మాసనానికి తెలిపారు. అయితే నవంబర్ 14న జరగాల్సిన ఎన్‌డిఎ ఎంట్రెన్ ఎగ్జామ్‌ను వాయిదా వేయాలని ఎఎస్‌జి కోర్టును కోరారు.
“ మీ సమస్యలను మేము అర్థం చేసుకోగలము. తగిన పరిష్కారాన్ని కనుగొనడంలో మీరు సమర్థులేనని మాకు తెలుసు. ప్రణాళిక కొనసాగాల్సిందే…ఎంతో మంది మహిళా అభ్యర్థినులు ఎన్‌డిఎ ఎంట్రెన్స్ పరీక్ష రాయాలని ఉవ్విలూరుతున్న తరుణంలో మేము కేంద్రం వినతిని అంగీకరించలేము” అని న్యాయమూర్తి బిఆర్ గవాయ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
మహిళలకు ఎగ్జామ్ పెట్టలేము… మోడీ ప్రభుత్వానికి మొట్టికాయలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -