Friday, January 10, 2025

కెటిఆర్‌కు ‘సుప్రీం’లో చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

ఫార్ములా ఈ కార్ రేస్‌వ్యవహారానికి సంబంధించి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను వెంటనే విచారించాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నెల 15న క్వాష్ పిటిషన్‌పై విచారణ చేస్తామని స్పష్టం చేసింది. ఎసిబి నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ను కొట్టివేయాలని కెటిఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను జనవరి 7న తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ అదే రోజు సాయంత్రం సుప్రీంకోర్టులో కెటిఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తక్షణం విచారణ చేయాలని కెటిఆర్ న్యాయవాది సీజేఐ సంజీవ్ ఖన్నాను కోరారు. అయితే ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని సిజెఐ అభిప్రాయపడ్డారు. జనవరి 15న ఈ పిటిషన్ పై విచారణ చేస్తామన్నారు. ఈ నెల 16న కెటిఆర్ ఇడి విచారణకు హాజరు కావాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News