Saturday, November 16, 2024

చారిత్రక ప్రదేశాల పేర్ల మార్పు పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: ప్రస్తుతం దురాక్రమణదారుల పేర్లతో వాడుకలో ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలు, నగరాల పేర్లను మార్చాలని కోరుతూ బిజెపి నాయకుడు, సీనియర్ న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను తరిస్కరిస్తూ రాజ్యంగపరమైన లౌకిక పునాదులను అతిక్రమించే విధంగా ఈ పిటిషన్ ఉందంటూ ఆగ్రహించింది. ఎంపిక చేసుకుని మరీ గతాన్ని తవ్వుతున్న పిటిషనర్ మొత్తం సంస్కృతిని అనాగరికం చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. హిందూత్వం చాలా గొప్ప మతమని, మతోన్మాదాన్ని అంగీకరించబోదని ధర్మాసనం స్పష్టం చేసింది.

దేశంఅనేక ఇతర సమస్యలను ఎదుర్కొంటోందని, వాటిపై ముందుగా దృష్టి సారించాల్సి ఉందని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. భారతీయులు తమలో తాము ఘర్షణపడే విధంగా విభజించు పాలించు ఎత్తుగడకు బ్రిటిష్ పాలకులు ఆనాడు పాల్పడ్డారని ఆమె గుర్తు చేశారు. భారతదేశం లౌకిక దేశమని, గతం బందిఖానాలో దేశం ఖైదీగా ఉండరాదని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించి ఇతర ప్రాథమిక హక్కుల సాధించుకునేందుకు వీలుకల్పించే విధంగా అనాగరిక విదేశీ దురాక్రమణదారుల పేర్లు ఉన్న చారిత్రక ప్రదేశాలు, నగరాల పేర్లను నిర్ధారించేందుకు పేర్లమార్పిడి కమిషన్‌ను కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని న్యాయవాది అశ్వనీ కుమార్ దూబే ద్వారా వేసిన పిల్‌లో ఉపాధ్యాయ కోరారు. అంతేగాక వేల సంఖ్యలో ఉన్న వెబ్‌సైట్లు, రికార్డులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవరించేందుకు వీలుగా వాటికి ఆదేశాలు జారీచేయాలని కూడా ఆయన సుప్రీంకోర్టును కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News