Tuesday, January 21, 2025

కడుపులో పిండానికీ జీవించే హక్కు : సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

27 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలని కోరుతూ ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల అవివాహిత అక్కడి హైకోర్టును ఆశ్రయించగా, నిరాకరిస్తూ మే 3న తీర్పు వెలువడింది. దీనిపై బాధిత మహిళ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వం లోని జస్టిస్ ఎస్‌వీ ఎన్ భట్టీ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది. తల్లి కడుపు లోని పిండానికీ జీవించే ప్రాథమిక హక్కు ఉందని స్పష్టం చేసింది. 27 వారాల గర్భాన్ని తొలగించాలంటూ 20 ఏళ్ల అవివాహిత చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.

“ గర్భం దాల్చి ఏడు నెలలు పూర్తి కావొస్తోంది. చిన్నారి మనుగడ మాటేమిటీ ? ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? తల్లి కడుపు లోని పిండానికీ, జీవించే ప్రాథమిక హక్కు ఉంది. దాని గురించి ఏం చెబుతారు ? మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదిక ప్రకారం పిండంతోపాటు తల్లికూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ గర్భాన్ని కొనసాగించేందుకు మహిళకు ఎటువంటి ప్రమాదం లేదు. గర్భవిచ్ఛిత్తికి నైతికంగా చట్టపరంగా అనుమతి లేదు. చట్టానికి విరుద్ధంగా ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేం ” అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News