Wednesday, January 22, 2025

గ్రూప్-1 మెయిన్స్ వాయిదాకు సుప్రీం నిరాకరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. పరీక్షలు ప్రారంభమైన ప్రస్తుత దశలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు స ర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. సోమవారం నుంచి ఈనెల 27 వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని టిజిపిఎస్ సి షెడ్యూల్ విడుదల చేసింది. మరోవైపు పరీక్షల నిర్వహణను వాయి దా వేయాలని కోరుతున్న అభ్యర్థులు జిఒ 29పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-1 బాధితుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాస నం ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలను వాయిదా వేయలేమని పేర్కొంది.

భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో టిజిపిఎస్‌సి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు గ్రూప్-1 మె యిన్స్ పరీక్షలు ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా కోర్టు తీర్పు ఎలా ఉంటుందనేదానిపై ఓ వైపు పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థులతో పాటు.. వాయిదా కోరుతు న్న అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొన్న వేళ.. న్యాయస్థానం తీర్పుతో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్ అయింది. జిఒ 29తో రిజర్వు అభ్యర్థు లు నష్టపోతారని కొందరు గ్రూప్-1 అభ్యర్థులు చెబుతుండగా.. ఎవరికి ఎలాంటి నష్టం ఉండబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు సుప్రీం ను ఆశ్రయించగా.. పరీక్షల వాయిదాకు నిరాకరిస్తూ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది.

2011 తర్వాత మెయిన్స్ పరీక్షలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ అనివార్య కారణాలతో వాయిదాపడుతూ వచ్చింది. దీంతో ఎలాంటి లోపాలు లేకుండా పరీక్షల నిర్వహణకు టిజిపిఎస్‌సి ఏర్పాట్లు చేసింది. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సిసిటివిలను ఏర్పాటు చేసింది.కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా సిసిటివిలను పర్యవేక్షించారు. పరీక్షల నిర్వహణలో కచ్చితమైన నియమ నిబంధనలు పాటించేలా స్పష్టమైన మార్గదర్శకాలను అధికారులు జారీచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News