Thursday, January 30, 2025

ఎపి సిఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట

- Advertisement -
- Advertisement -

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులను సిబిఐకి బదిలీ చేయాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇది పూర్తిగా పనికిమాలిన పిటిషన్ అని జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని పేర్కొంది. చంద్రబాబుపై సిఐడి నమోదు చేసిన 7 కేసులు సిబిఐకి బదిలీ చేయాలని హైకోర్టు న్యాయవాది బి.బాలయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాలయ్య తరఫున వాదనలు వినిపించడానికి సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ సిద్ధమయ్యారు.

మణీందర్ సింగ్‌పై తీవ్రస్థాయిలో జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో కూడా మీలాంటి సీనియర్లు హాజరవుతారని అసలు ఊహించలేదని సర్వోన్నత న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా పనికిమాలిన పిటిషన్ అని తెలిపింది. దీనిపై ఒక్కమాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఒక్క మాట కూడా వినకుండానే సుప్రీంకోర్టు పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News