న్యూఢిల్లీ : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌కు సుప్రీం కోర్టులో బుధవారం ఊరట లభించింది. ఆయనకు బూటకపు కంపెనీలు ఉన్నాయని, ఆయన మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారని, ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చే దర్యాప్తు చేయించాలని జార్ఖండ్ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిల్స్‌పై తదుపరి చర్యలను నిలిపి వేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శివశంకర్ శర్మ దాఖలు చేసిన వీటిని జార్ఖండ్ హైకోర్టు జూన్ 3 న విచారణకు స్వీకరించింది. గనుల లీజులను అక్రమంగా మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులపై దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ కోరారు. 2010లో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కాంట్రాక్టుల మంజూరుపై కూడా దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ పిటిషన్లపై విచారణ నిలిపివేయాలని జార్ఖండ్ ప్రభుత్వంతోపాటు సొరేన్ కూడా అపీలు చేశారు. ఈ అపీళ్లపై జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్‌ఆర్ భట్, జస్టిస్ సుధాంశు ధూలియా ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు ఈ పిల్స్‌పై విచారణ జరపరాదని ఆదేశించింది.
జార్ఖండ్ సిఎంకు సుప్రీం కోర్టులో ఊరట
- Advertisement -
- Advertisement -
- Advertisement -