Tuesday, December 17, 2024

పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ చేయకుండా రాజ్‌కుంద్రాకు సుప్రీంకోర్టులో ఊరట

- Advertisement -
- Advertisement -

Supreme Court relief to Raj Kundra in pornography case

 

న్యూఢిల్లీ: అశ్లీల చిత్రాల(పోర్నోగ్రఫీ) కేసులో వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాకు ఊరట లభించింది. ఈ కేసులో కుంద్రాను అరెస్ట్ చేయొద్దంటూ ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ముంబయి సైబర్ సెల్ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంలో బుధవారం విచారణ జరిపిన జస్టిస్ వినీత్‌శరణ్, జస్టిస్ అనిరుద్ధాబోస్ ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. నాలుగు వారాల్లోగా దీనిపై స్పందన తెలియజేయాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ జారీ చేసింది. ఈలోగా ఆయణ్ని అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. యాంటిసిపేటరీ బెయిల్ కోసం వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు నవంబర్ 25న తిరస్కరించడంతో కుంద్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జులైలో అరెస్టయిన కుంద్రా సెప్టెంబర్‌లో బెయిల్‌పై విడుదలయ్యారు. బాలీవుడ్ నటి శిల్పాషెట్టి భర్త అయిన కుంద్రాపై పోర్నోగ్రఫీ కేసు నమోదైన విషయం తెలిసిందే. అశ్లీల చిత్రాల వీడియోలను పంపిణీ చేస్తున్నారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News