Sunday, January 19, 2025

ఈడబ్లూఎస్ కోటాపై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

Supreme Court reserves verdict on EWS Quota

న్యూఢిల్లీ: వెనుకబడిన ఉన్నత వర్గాలకు కల్పించిన 10శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును మంగళవారం రిజర్వ్ చేసింది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రం ఈడబ్లూఎస్ కోటా ప్రకారం విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. దీనిని వ్యతిరేకిస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వాటిని విచారించిన సరోన్నత న్యాయస్థానం రిజర్వ్‌చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లలిత్ నేతృత్వంలోని జడ్జిలతో కూడిన ఉన్నత ధర్మాసనం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈడబ్యూఎస్ కోటా రాజ్యాంగం సూచించిన రిజర్వేషన్ల విధానానికి అనుగుణంగా జరిగిందా లేక నిబంధనలకు విరుద్ధంగా జరిగిందా అని సుప్రీంకోర్టు పరిశీలించింది. ఆరున్నర రోజులుగా జనరల్ వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ మెహతాతోపాటు సీనియర్ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.

విద్యావేత్త గోపాల్ 13న ధర్మాసనం ఎదుట తమ వాదనను వినిపించారు. ఈడబ్లూఎస్ కోటా సవరణ మోసపూరితమని, చేసిన ప్రయత్నమని ఆరోపించారు. అదేవిధంగా కోటాను వ్యతిరేకిస్తూ న్యాయవాదులు కుమార్, విల్సన్, ఆరోరా, పారిఖ్, చౌహాన్‌తోపాటు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో సిజెఐ లలిత్‌తోపాటు, దినేశ్ ఎస్ రవీంద్రభట్, బెల ఎం త్రివేది, జెబి పార్థివాలా సభ్యులుగా ఈడబ్లూఎస్ కోటాను వ్యతిరేకిస్తున్న తమిళనాడు తరఫున సీనియర్ న్యాయవాది నాఫడే వాదనలు వినిపించారు. మరోవైపు ప్రభుత్వం తరఫున వినిపించిన జనరల్, జనరల్ మాట్లాడుతూ ఈడబ్లూస్ కోటా జరిగిన రాజ్యాంగ సవరణ శాతం రిజర్వేషన్ పరిమితికి లోబడే జరిగిందన్నారు. ఎటువంటి రిజర్వేషన్ల పరిధిలోకి రాని పేదవారికి ఈడబ్లూఎస్ రిజర్వేషన్ కోటా అవసరమని సుప్రీం ధర్మాసనానికి విన్నవించారు.

Supreme Court reserves verdict on EWS Quota

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News