Thursday, January 23, 2025

కోర్టుల టోకు ఆజామాయిషీ కుదరదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : న్యాయస్థానాలు మొత్తం వ్యవస్థను ఆజమాయిషీ చేయలేవని, పరిమితులు ఉంటాయని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. మాతృత్వ పితృత్వ వాజ్యాలలో సరైన నిర్ణయానికి దేశవ్యాప్తంగా డిఎన్‌ఎ టెస్ట్ నిబంధన ఖరారు చేయాలని దాఖలు అయిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ పిటిషన్‌ను తాము స్వీకరించడం కుదరదని తోసిపుచ్చింది. న్యాయస్థానాలు యావత్తూ వ్యవస్థకు జవాబుదారి కాదని న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సుధాంశు ధులియాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

ఒక్క కేసుకు సంబంధించిన వ్యవహారంలో కోర్టు విస్తృత దేశవ్యాప్త ప్రాతిపదిక రూలింగ్‌ను వెలువరించడం దీనిని వర్తింపచేయడం కుదరదని, ఇది దుర్లభం అని తేల్చిచెప్పారు. తమ ముందుకు వచ్చే వ్యాజ్యాలలోని అంశాల వారిగా స్పందించేందుకు వీలుంటుంది. సంబంధిత పక్షాలకు వర్తించేలా రూలింగ్ వెలువరించడం జరుగుతుంది. అంతేకాని సంబంధిత ఈ పేరెంట్‌హుడ్ విషసయంలో సార్వత్రిక రూలింగ్ కుదరదని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News