Thursday, January 23, 2025

ఫిబ్రవరి 14 నుంచి వారానికి రెండుసార్లు సుప్రీంలో ప్రత్యక్ష విచారణ

- Advertisement -
- Advertisement -

Supreme court reverts to hybrid hearing from February 14

 

న్యూఢిల్లీ : ఫిబ్రవరి 14 నుంచి వారానికి రెండు రోజులు ప్రత్యక్ష విచారణ నిర్వహించడానికి సుప్రీం కోర్టు సోమవారం నిర్ణయించింది. ప్రతివారం బుధ, గురువారాల్లో ఈ విచారణ జరుగుతుంది. మిగతా రోజులు గత ఏడాది మాదిరిగానే హైబ్రిడ్ విధానంలో విచారణ నిర్వహిస్తారు. కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడం , అలాగే పాజిటివిటీ రేటు కూడా తగ్గుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్ ఒక ప్రకటన విడుదల చేశారు. జడ్జిల కమిటీతో చర్చించిన తరువాత చీఫ్ జస్టిస్ రమణ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News