- Advertisement -
హైదరాబాద్: నూతన సాగు చట్టాలు, రైతుల ఆందోళనలపై సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. రైతుల ఆందోళనలపై కేంద్రం అభ్యంతరాలను సుప్రీం కొట్టేసింది. నూతన వ్యవసాయ చట్టాలపై స్టే విధించింది. చర్చల కోసం నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశామని వివరించింది. తదుపరి ఉత్తర్వలు వచ్చే వరకు సాగు చట్టాలపై స్టే ఉంటుందని సుప్రీం తెలిపింది.
పిటిసనర్, న్యాయవాది ఎంఎల్ శర్మ వాదనలు ప్రారంభించారు. ఎంఎల్ శర్మ రైతులతో స్వయంగా మాట్లాడినట్టు కోర్టుకు తెలిపాడు. కమిటీ ముందు హాజరు కాబోమని రైతులు చెప్పినట్టు వెల్లడించారు. సాగు చట్టాల రద్దును రైతులు కోరుకుంటున్నారని కోర్టుకు శర్మ తెలిపాడు. కమిటీని నియమించే అధికారంతో పాటు చట్టాలను నిలిపివేసే అధికారం కూడా తమకు ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
- Advertisement -