Friday, December 20, 2024

ఆర్య సమాజ్ వివాహ పత్రానికి చట్టబద్ధత లేదు: సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

Supreme Court
సుప్రీంకోర్టు: ఓ మైనరును కిడ్నాప్, బలాత్కారం చేసిన కేసులో నిందితుడి బెయిల్ దరఖాస్తును పరిశీలిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఆర్యసమాజ్ జారీ చేసిన వివాహ పత్రాన్ని ఆమోదించేందుకు నిరాకరించింది. నిందితుడిపై ఐపిసికి సంబంధించిన సెక్షన్లు 363, 366ఎ, 384, 376(2)(n), 384, పోస్కో చట్టంకు సంబంధించిన సెక్షన్ 5(L)/6 కింద నేరాలు నమోదయ్యాయి.
బలాత్కారం జరిగిన అమ్మాయి మేజర్ అని, ఆమెకు పిటిషనర్‌కు మధ్య ఆర్యసమాజ్‌లో పెళ్ళి కూడా జరిగిందని నిందితుడి తరఫు న్యాయవాది వాదనను న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, బివి నాగరత్నతో కూడిన వెకేషన్ బెంచి తిరస్కరించింది. ఇంకా ఇలా తెలిపింది: “ ఆర్య సమాజ్‌కు వివాహ సర్టిఫికేట్ ఇచ్చే అధికారం లేదు. ఇది అధికారులకు సంబంధించిన పని. అసలైన సర్టిఫికేట్‌ను చూయించండి”.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News