Sunday, December 22, 2024

ఎల్‌ఎంవీ లైసెన్స్‌తో కమర్షియల్ వాహనాలు నడపొచ్చు: సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ వివాదంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎల్‌ఎంవీ లైసెన్స్ ఉన్నవారు రవాణా వాహనాన్ని కూడా నడపొచ్చని, దానికి మరో లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. వ్యాపారం చేసుకునే వ్యక్తులు ఆటోలు, క్యాబ్‌లు నడిపేవారు ఎల్‌ఎంవీ లైసెన్సుతో 7500 కిలోల కంటే తక్కువ బరువున్న కమర్షియల్ వాహనాలను నడపొచ్చని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వం లోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం వెల్లడించింది. 2017 ముకుంద్ దేవాంగన్ వర్సెస్ ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కేసులో త్రిసభ్య ధర్మాసనం 7500 కిలోల గరిష్ఠ బరువుకు మించని రవాణా వాహనాన్ని తేలికపాటి వాహనం (ఎల్‌ఎంవీ) పరిధి నుంచి మినహాయించవద్దని తీర్పునిచ్చింది.అయితే దానికి అనుమతిస్తే ఎల్‌ఎంవీ లైసెన్స్ ఉన్న వ్యక్తి బస్సు, ట్రక్కు లేదా రోడ్ రోలర్‌ను కూడా నడపడానికి వీలు కల్పిస్తుందని , దీనివల్ల పౌరుల జీవితాలు ప్రమాదంలో పడతాయని పేర్కొంది. నష్టపరిహారం చెల్లించడానికి బీమా కంపెనీలపై భారం పెరిగే అవకాశం ఉందని భావించిన ఇన్సూరెన్స్ కంపెనీలు

త్రిసభ్య ధర్మాసనం తీర్పును సవాలు చేస్తూ సుప్రీంలో 75 పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై తాజాగా దర్యాప్తు చేసిన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వం లోని రాజ్యాంగ ధర్మాసనం త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునే పూర్తిగా సమర్ధిస్తూ ఇన్సూరెన్స్ కంపెనీలు వేసిన పిటిషన్లను కొట్టివేసింది. మోటారు వాహనాల చట్టం (ఎంవీ చట్టం) కింద పేర్కొన్న అదనపు శిక్షణ, అర్హత ప్రమాణాలు 7500 కిలోల కంటే తక్కువ బరువును రవాణా చేసే వాహనాలను నడపాలనుకొనే వ్యక్తులకు వర్తిస్తాయని పేర్కొంది. అంతకంటే ఎక్కువ బరువున్న వాహనాలు ఈ పరిధి లోకి రావని స్పష్టం చేసింది. ఇది డ్రైవర్ల జీవనోపాధికి సంబంధించిన సమస్య కాబట్టి చట్టానికి సవరణలు తీసుకువచ్చి ,, వారికి ఒక మార్గాన్ని చూపాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ సవరణలు రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ (ఎంఓఆర్‌టిహెచ్) వద్ద పెండింగ్‌లో ఉన్నాయని అటార్నీ జనరల్ ఆర్. వెంకట రమణి న్యాయస్థానానికి తెలియజేశారు. సరైన సమయంలో వాటిని నోటిఫై చేస్తామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News