Sunday, January 19, 2025

కేజ్రీవాల్ తాత్కాలిక బెయిల్ మంజూరు పరిశీలిస్తానన్న కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఒకవేళ తాత్కాలిక బెయిల్ ఇవ్వాలనుకుంటే ఎలాంటి కండిషన్స్ పెట్టాలో తయారు చేయమని ఈడిని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయాన్ని మే 7న(మంగళవారం) చేపట్టనున్నట్లు కూడా తెలిపింది. ‘‘మేము బెయిల్ ఇస్తామో లేదో కానీ ఏ పక్షానికి ఆశ్చర్యకరంగా ఉండకుండా చూడాలన్నదే మా ఉద్దేశ్యం’’ అని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా తో కూడిన ధర్మాసనం తెలిపింది. అంతేకాక బెయిల్ మంజూరు చేస్తామని ఇరు వర్గాలు ముందుగానే అభిప్రాయానికి రాకూడదని కూడా చెప్పింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News