Thursday, December 19, 2024

దేవుళ్లనైనా రాజకీయాలకు దూరం పెట్టండి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పూర్తి ఆధారాలు లేకుండా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్ర సాదంలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నె య్యిని ఉపయోగించారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు బ హిరంగ ఆరోపణలు ఎలా చేస్తారని సుప్రీంకో ర్టు సోమవారం ప్రశ్నించింది. ఈ ఆరోపణలపై మీరే దర్యాప్తునకు ఆదేశించిన తర్వాత మీడియా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏ మిటని ప్రశ్నించిన సుప్రీంకోర్టు దేవుళ్లను రా జకీయాల నుంచి దూరంగా ఉంచాలంటూ సూచించింది. తిరుమల ఆలయంలోని లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఆరోపణలకు సంబంధించి దాఖలైన పలు పి టిషన్లపై సోమవారం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథ్‌న్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు తీ రును ధర్మాసనం తప్పుపట్టింది. రాజ్యాంగపరమైన పదవులను నిర్వహించే వ్యక్తులపై మతాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.

కేసు నమోదు లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు కావడానికి ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడు ఈ వివాదంపై మాట్లాడారని ధర్మాసనం గుర్తు చేసింది. సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి ప్రకటన చేశారని, సెప్టెంబర్ 25న ఎఫ్‌ఐఆర్ నమోదు అయిందని, సెప్టెంబర్ 26న సిట్ ఏర్పాటు జరిగిందని ధర్మాసనం వివరించింది. భక్తుల మనోభావాలను ప్రభావితం చేసే విధంగా అటువంటి ప్రకటన చేయవచ్చా అని ప్రశ్నించిన ధర్మాసనం దర్యాప్తునకు ఆదేశించిన తర్వాత ఉన్నతమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ఆ విధమైన సమాచారాన్ని ప్రజలకు బహిర్గత పరచడం సమంజసం కాదని తాము ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నట్లు పేర్కొంది.

సిట్ ఏర్పాటుకు ఆదేశించిన మీరు మీడియా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏమిటని ముఖ్యమంత్రిని ధర్మాసనం ప్రశ్నించింది. మీరు ఇటువంటి కేసుల పైనే హాజరవుతున్నారని, ఇది రెండవసారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గికి ధర్మాసనం తెలిపింది. ఇవి నిజాయితీతో కూడిన పిటిషన్లు కాదని రోహత్గి ఈ సందర్భంగా వాదించారు. ప్రస్తుత ప్రభుత్వంపై దాడి చేసేందుకు గత పాలకులు చేస్తున్న ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు. కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి వారికి సంబంధించిన సరఫరాదారులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) నోటీసులు జారీచేసిందని ఆయన తెలిపారు. తిరుమల శ్రీవారి లూడ్డ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించారని నిర్ధారించేందుకు మీ వద్ద ఉన్న ఆధారాలు ఏమిటని ధర్మాసనం ప్రశ్నించగా టిటిడి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా దీనిపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. మరి అలాంటప్పుడు మీడియా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏమిటి? భక్తుల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం మీకు ఉంది అంటూ జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు.

లడ్డూల తయారీకి కల్తీ నెయ్యిని ఉపయోగించారన రుజువుచేసే నివేదిక ఏదీ లేదని ధర్మాసనం తెలిపింది. లడ్డూలు రుచికరంగా లేవని భక్తులు ఫిర్యాదు చేశారని లూథ్రా కోర్టు దృష్టికి తీసుకురాగా రుచిగా లేని లడ్డూలను లేబ్‌కు పంపించారా అని ధర్మాసనం ప్రశ్నించింది. సాధారణంగా ఇటువంటి విషయాలలో రెండవ అభిప్రాయం కోరతామని, కాని కల్తీ అని చెబుతున్న నెయ్యిని లడ్డూల తయారీలో ఉపయోగించారని చెప్పేందుకు ఇక్కడ అధారాలు ఏవీ లేవని జస్టిస్ విశ్వనాథన్ అన్నారు. ఈ వివాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించే విషయమై కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు కోరవలసిందిగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించిన ధర్మాసనం కేసు తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి(గురువారం) వాయిదా వేసింది. బిజెపి నాయకుడు డాక్టర్ సుబ్రమణియన్ స్వామి, రాజ్యసభ సభ్యుడు, టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, చరిత్కారుడు విక్రమ్ సంపత్, ఆధ్యాత్మిక ప్రవచనకర్త దుష్యంత్ శ్రీధర్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.

టిడిపి తరపు లాయర్లపై ప్రశ్నల వర్షం
తిరుమల లడ్డూ కల్తీ విషయంపై సుప్రీంకోర్టులో సోమవారం హాట్ హాట్‌గా విచారణ సాగింది. ‘మీ వద్ద ఆధారాలున్నాయా? నెయ్యిని రిజెక్ట్ చేశారని ఇఒ చెప్పారు కదా? నెయ్యి రిజెక్ట్ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా? ఇదంతా పబ్లిక్ డొమైన్‌లో ఉంది కదా? జులైలో రిపోర్ట్ వస్తే.. సెప్టెంబర్‌లో చెప్పారెందుకు? ఎన్‌డిడిబి మాత్రమే ఎందుకు? మైసూర్ లేదంటే ఘజియాబాద్ ల్యాబ్‌ల నుంచి సెకండ్ ఒపినీయన్ ఎందుకు తీసుకోలేదు? కల్తీ నెయ్యిని లడ్డూలో వాడినట్లు ఆధారాల్లేవు. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చేందుకు శాంపిల్‌ను ల్యాబ్‌కు పంపించారా?’ అని టిటిడి లాయర్ సిద్ధార్థ లూథ్రాను ‘సుప్రీం’ ప్రశ్నించింది. ‘నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్షం ఉందా? ఉంటే చూపించండి, ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు?, ఎన్‌డిడిబి మాత్రమే ఎందుకు? కల్తీ జరిగినట్టు ఆరోపించిన లడ్డూలను పరీక్షించారా? లడ్డూలను ముందుగానే ఎందుకు పరీక్షకు పంపలేదు?, కల్తీ జరిగినప్పుడు ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు? లడ్డూ అంశంపై విచారణకు సిట్ వేశారు? ఇది దర్యాప్తునకు సరిపోతుందా? మీ అభిప్రాయం చెప్పండని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం అడిగింది. ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తరఫు న్యాయవాది సరైన సమా ధానం చెప్పలేకపోయారు.

చంద్రబాబు ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ‘సుప్రీం’ పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలి
కాగా, తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న సిఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బిజెపి సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి, ఎంపి వైవి సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపి వైవి సుబ్బారెడ్డి అభ్యర్థించారు. ఎన్‌డిడిబి ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని విన్నవించారు. ఈ కేసులో సుబ్రమణియన్ స్వామి వాదనలు వినిపించారు. తిరస్కరించిన నెయ్యిని వాడినప్పుడు లడ్డూ అపవిత్రత ఎందుకైంది, ల్యాబ్ రిపోర్టు తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా? అనేది కూడా తేల్చాలని ఆయన తన పిటిషన్‌లో ప్రస్తావించారు.

ఎపి సిఎం ప్రకటన విరుద్ధంగా ఉంది
సుబ్రహ్మణ్యస్వామి తరుపు కూడా గట్టిగా వాదనలు వినిపించారు. కల్తీ జరిగినట్లు తేలిన నెయ్యిట్యాంకర్‌ని అనుమతించలేదని టిటిడి చెబుతోందని రాజశేఖరన్ అన్నారు. టిటిడి చెప్పినదానికి ఎపి సిఎం ప్రకటన విరుద్ధంగా ఉందన్నారు. ప్రాథమిక స్థాయిలో నాణ్యత పరీక్షలు పాస్ కాకపోతే ట్యాంకర్ లోపలికి వెళ్లదని టిటిడి చెబుతోందని తెలిపారు. శాంపిల్స్‌ని ఎక్కడనుంచి సేకరించారు, తిరస్కరించిన ట్యాంకర్ నుంచి శాంపిల్స్ సేకరించారా? అంటూ పేర్కొన్నారు. ఇందులో రాజకీయ జోక్యాన్ని అనుమతించవచ్చా?ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. కల్తీ నెయ్యి ఎన్నడూ వాడలేదని టిటిడి అధికారి చెప్పారంటూ రాజశేఖరన్ కోర్టుకు విన్నవించారు. టిటిడి అధికారి ఐఏఎస్సా?- అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రసాదంపై అనుమానాలు ఉంటే దర్యాప్తు చేయాలి అంతేగానీ ఆధారాలు లేకుండా ప్రసాదం కలుషితమైందని ప్రకటించడం ఆందోళనకరంగా ఉందని, ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తికి ఎలాంటి బాధ్యత ఉంటుంది? అంటూ పరోక్షంగా సీఎం చంద్రబాబును ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News