- Advertisement -
న్యూఢిల్లీ: అస్సాం, ఈశాన్య రాష్ట్రాలలోకి 1971 మార్చి 25 తర్వాత అక్రమంగా ప్రవేశించిన వలసదారుపై సమగ్ర వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అస్సాంలో వివిధ వర్గాల మర్తీవ్ర స్థాయిలో చర్చకు దారితీసిన వివాదాస్పద సెక్షన్ 6ఎకు సంబంధించి సుప్రీంకోర్టు చేపట్టిన సమగ్ర విచారణలో భాగంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. 1955 నాటి పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6ఎ చట్టబద్ధతను సవాలు చేస్తూ
దాఖలైన అనేక పిటిషన్లపై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మంగళవారం(డిసెంబర్ 5) విచరాణ చేపట్టింది. అస్పాం ఒప్పందం అమలులో అత్యంత కీలకమైన సెక్షన్ 16ఎ ప్రకారం 1996 జనవరి 1 నుంచి 1971 మార్చి 25 మధ్యన అస్సాంలో ప్రవేశించిన కొందరు విదేశీ వలసవాదాలు భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
- Advertisement -