Monday, December 23, 2024

మణిపూర్‌పై నిజాలు తెలుపండి..రాష్ట్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మణిపూర్‌లో వాస్తవిక , క్షేత్రస్థాయి పరిస్థితిపై తమకు సమగ్ర నివేదిక అందించాలని సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతోందని, రెండు మూడు రోజులలో స్కూళ్లను తిరిగి తెరుస్తున్నట్లు , బంకర్లను తొలిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే తమకు పూర్తిస్థాయి నివేదిక కావాలని, క్షేత్రస్థాయి పరిస్థితిని తెలియచేయాలని తెలిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం మణిపూర్ పరిస్థితిపై దాఖలు అయిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం తమకు నివేదిక అందించాలని సూచించింది.

సమ్మర్ వెకేషన్ తరువాత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం అత్యవసర ప్రాతిపదికనే విచారణ చేపట్టింది.సొలిసిటర్ జనరల్ ద్వారా పరిస్థితిపై సమగ్ర నివేదిక అవసరం అని, అయినా ఎక్కువ కాలం విచారణను సాగదీయదల్చుకోలేదని, ముందుగా పరిస్థితిని చక్కదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకుంటామని ధర్మాసనం తెలిపింది. సోమవారం విచారణ దశలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. అంతా బాగుపడుతోందని తెలిపారు. రాష్ట్రంలో తమకు సైనిక రక్షణ కల్పించాలని కుకీలు డిమాండ్ చేస్తున్నారు. వీరి తరఫున కూడా పిటిషన్ దాఖలు అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News