Sunday, January 5, 2025

జగన్ అక్రమాస్తుల కేసు వివరాలు కోరిన సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జగన్ అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలను అందించాలని సిబిఐ, ఈడి  లను సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసుల పూర్తి వివరాలను రెండు వారాల్లోగా అందించాలని పేర్కొంది. కింది కోర్టుల్లో ఉన్న డిశ్చార్చ్ పిటిషన్ల వివరాలను ఇవ్వాలని కూడా తెలిపింది. తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలు అందించాలని పేర్కొంది. సిబిఐ, ఈడి కేసుల వివరాలను విడివిడిగా పట్టిక రూపంలో అందించాలంది. అన్ని వివరాలతో అఫిడవిట్లను రెండు వారాల్లో దాఖలు చేయాలని ఆదేశించింది.

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యమవుతోందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు గతంలో పిటిషన్ వేశారు.  కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్నారు. దీనిపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం విచారణను చేపట్టింది. కాగా రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్లు ఇరుపక్షాల న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ధర్మసనం విచారణ ఇన్నేళ్లపాటు ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించింది. వాయిదా పిటిషన్లు, ఉన్నత కోర్టుల్లో విచారణ పెండింగే కారణమని న్యాయవాదులు వివరణ ఇచ్చుకున్నారు. దాంతో పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలిస్తే తగిన ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, ట్రయల్ కోర్టు వివరాలు, పెండింగ్ కేసుల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 13కు వాయిదా వేసింది.

YS Jagan

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News